జిల్లాలో పర్యాటక, క్రీడా శాఖల పరిధిలో చేపట్టనున్న పలు అంశాలపై కలెక్టర్ మంత్రికి వివరించారు.



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 




జిల్లా ప్రధాన కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా ను జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత శుక్రవారం ఉదయం స్థానికంగా బస చేసిన విడిది గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చేం అందచేశారు.


ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక, క్రీడా శాఖల పరిధిలో చేపట్టనున్న పలు అంశాలపై కలెక్టర్ మంత్రికి వివరించారు.


రాజమహేంద్రవరం నగరాన్ని సాంసృతిక, సంప్రదాయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతం తదితర వివరాలు గురించి మంత్రి అడిగి తెలుసుకోవడం జరిగింది.


మంత్రిని కలిసిన వారిలో మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, తదితరులు ఉన్నారు.




Comments