నాకు ఓట్లు వేయలేదని నేను పులివెందులలో పనులు నిలిపి వెయ్యలేదు.

 చిత్తూరు జిల్లా (ప్రజా అమరావతి);


*కుప్పం నియోజకవర్గం లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన*


శాంతిపురం మండలం, కొంగణపల్లి లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం:-


కుప్పం నియోజకవర్గం పై ప్రభుత్వానికి శీతకన్ను.


నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదు


ఈ చేతగాని ప్రభుత్వం... మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చెయ్యలేదు.


నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు ఇచ్చాను.


నాకు ఓట్లు వేయలేదని నేను పులివెందులలో పనులు నిలిపి వెయ్యలేదు.


కుప్పంలో 100 కోట్లు పేదల ఇళ్లపై ఖర్చు పెట్టాం...వాటిని నిలిపివేశారు.


కుప్పం లో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలని 1350 కోట్లు కేటాయించి సగం ఖర్చు చేశాం 


కుప్పం కు రావాల్సిన 1350 కోట్ల నిధుల జీవోలు రద్దు చేసి ఇప్పుడు 65 కోట్లు ఇస్తాం అంటున్నారు.


డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఉత్తమ విధానానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాను.


మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చాం


వైసీపీ ప్రభుత్వం లో

మూడేళ్లలో ఒక్క ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చరా?


రాష్ట్రం లో సంక్షేమం కాదు...అందరినీ బాదుడే బాదుడు.


300 యూనిట్ల విద్యుత్ వాడితే అమ్మఒడి పథకం కట్.


టాక్సీ ఉన్నా పథకాలు తీసేస్తున్నారు.


మన నియోజకవర్గం లో కొందరు రౌడీ ఇజం చేస్తున్నారు


ఇక్కడ వేషాలు వేసే వారిని పులివెందుల వరకు తరుముతాం


నా పర్యటనకు కావాలని అడ్డంకులు సృష్టిస్తారా?


పోలీసులు న్యాయం గా ఉండాలి....మాట్లాడితే FIR పెడుతున్నారు. పద్దతి మార్చుకోవాలి.


వైసీపీ కి చెందిన దొంగలు, రౌడీ లు గుర్తు పెట్టుకోవాలి. అందరి ఆటలు కట్టిస్తాం


టీడీపీ మద్దతు దారులకు పెన్షన్ లు, పథకాలు నిలిపివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయం చేస్తాం. 


నిలిపివేసిన పథకాలు వడ్డీ తో సహా ఇప్పిస్తాం


అందరూ పన్నులు కడుతున్నారు....ఇదేమి జగన్ సొంత సొమ్ము కాదు.


కుప్పంలో పథకాలు ఎందుకు నిలిపి వేస్తున్నారు?


*కుప్పం పర్యటనలో కొల్లుపల్లి లో టీడీపీ అధినేత ప్రసంగం*


టీడీపీ ఓడిన ప్రతి సారి కుప్పం పై అయా ప్రభుత్వాల వివక్ష


రాజకీయం వేరు...అభివృద్ధి వేరు అని నేను ఆలోచించాను.


అందుకే పులివెందులకు నీళ్ళు ఇచ్చాను 


వైసీపీ ని పులివెందుల లోనే భూస్థాపితం చేస్తాను.


పంచాయతీ ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచాం అని పుంగనూరు పుడింగి ఇక్కడ హడావుడి చేస్తున్నారు.


ఏమీ చేశారని ప్రజలను జగన్ ఓట్లు అడుగుతారు.


బాబాయ్ ను చంపాను అని ఓట్లు అడుగుతారా?


నేను పులివెందులను కుప్పం లా అభివృద్ధి చేద్ధాము అనుకున్నా.


మీరు కుప్పాన్ని పులివెందుల చెయ్యాలి అనుకుంటున్నారు.


ఒకరిద్దరు రౌడీఇజం చేస్తే టీడీపీ భయపడదు.


వైసీపీ 175 గెలవడం కాదు....ఈ సారి పులివెందుల కూడా ఓడిపోతారు 


YSR CM గా ఉన్నప్పుడు లేపాక్షి హబ్ పేరుతో ఇందు అనే సంస్థకు 8500 ఎకరాలు ఇచ్చారు.


ఇందులో అక్రమాలు జరిగాయి అని జగన్ జైలుకు కూడా వెళ్ళాడు.


ఇప్పుడు ఆ కంపెనీ దివాలా తీసిందని ఆ భూములు కొట్టేసే పరిస్థితి కి వచ్చారు.


దివాలా పేరుతో 500 కోట్లు ఇచ్చి 9 నుంచి 18 వేల కోట్ల విలువైన భూములు కొట్టేస్తున్నారు.


జగన్ మేనమామ కొడుకే ఈ భూములు కొట్టేస్తునారు.


పోరాటాలు చేసిన టీడీపీ పులివెందుల పిల్లికి భయపడదు.


పులివెందులలో జగన్ చెడబుట్టాడు...ప్రజలకు గౌరవం తెచ్చేలా నాయకుడు ఉండాలి.


ప్రశాంతతకు మారు పేరైన కుప్పం లో డ్రామాలు మొదలు పెట్టారు.


10 మంది రౌడీ లను మద్యం పోసి మాపై పురిగొల్పుతున్నారు


పోలీసులు ఇలా నిర్వీర్యం అయితే ఎలా?


మీ దగ్గర అవినీతి డబ్బు ఉంది...కుప్పానికి ఎన్నికల్లో లారీల్లో డబ్బు పంపుతాడు.


అవినీతి డబ్బు మన కుప్పం ప్రజలకు వద్దు.


ఒక ఎంపీ బట్టలు విప్పి తిరుగుతుంటే తప్పు అని సీఎం పిలిచి చెప్పాలి.


ఎంపీతో సీఎం రాజీనామా చేయించాలి. కానీ ప్రశ్నించిన మాపై కేసులు పెడుతున్నారు.


ఇక్కడ గ్రానైట్ దొచేస్తుంటే వెళ్ళడానికి మాకు హక్కు లేదా?


కుప్పం లో  పోలీసులు మా వాళ్లపై కేసులు పెట్టారు.


ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు చెయ్యాలా అని నాకూ అప్పుడప్పుడు అనిపిస్తుంది.


కానీ గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అని రాజకీయాల్లో ఉన్నాను...ఉంటాను.


కుప్పంలో ఎంతమంది నా కులం వాళ్ళు ఉన్నారు.నాకు కులం అంటగడతారా?


అందుకే కులం పేరు ఎత్తితే చెప్పు చూపించమని చెప్పాను.


కులాల మత్తు నుంచి జనం బయటకు రావాలి.


జగన్ కు మానవత్వం ఉందా...నెల్లూరు లో దళితుడు ప్రాణం పోయినా స్పందించరా? ఇదొక పుటకేనా?


నెల్లూరులో కుటుంబానికి డబ్బులు ఇచ్చి కేసు సెటిల్మెంట్ చేస్తారా?

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image