నెల్లూరు (ప్రజా అమరావతి);
క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపకరిస్తాయ
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక ఎ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా క్రీడా సాధికార సంస్థ ఆద్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తీరంగా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జడ్పి ఛైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, నగర మేయర్ శ్రీమతి పోట్లూరి స్రవంతి, నుడా ఛైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్ లతో కలసి ప్రారంభించారు
ఈ సందర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. క్రీడలకు ఆతిధ్యం ఇవ్వడంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో వుందన్నారు. ఈ సంవత్సరం చివర లోపు స్పొర్ట్స్ నేషనల్ మీట్ ను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈ సంధర్భంగా మంత్రి, జిల్లా స్పొర్ట్స్ అధికారులకు సూచించారు. నేను జిల్లా పరిషత్ ఛైర్మన్ గా వున్న సమయంలో 5 సంవత్సరాల పాటు సి.ఎం కప్ క్రీడా పోటీలను జిల్లాలో నిర్వహించడం జరిగిందని మంత్రి తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటమి అనేది సహజమని, ఓడినవారు నిరుత్సాహం చెందకుండా రాబోయే క్రీడలలో విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిచ్చి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. సచివాలయ ఉద్యోగాల్లో స్పొర్ట్స్ కోటా కింద ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధులు స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసారని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, దేశభక్తిని పెంపొందించుకునేలా జిల్లా స్థాయి క్రీడా పోటీలను జరుపుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1వ తేది నుండి 15 రోజుల పాటు ప్రతి రోజు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ రోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు క్రీడా పోటీలను నిర్వహించుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు చదువు పైనే కాకుండా క్రీడలలో కూడా బాగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రతి విద్యార్ధి క్రీడలను ఒక అలవాటుగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్, విద్యార్ధులకు సూచించారు.
అనంతరం మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జడ్పి ఛైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, నగర మేయర్ శ్రీమతి పోట్లూరి స్రవంతి, నుడా ఛైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్ లతో కలసి జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహిస్తున్న ఖో ఖో, కబడి, వాలీబాల్, బ్యాట్మింటన్, స్విమింగ్ క్రీడలను క్రీడల వారీగా ప్రారంభించారు.
తొలుత మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బొందిలి వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఎస్. కిషోర్ సింగ్, జడ్పి సి.ఈ.ఓ శ్రీమతి వాణి, సోషల్ వెల్ఫేర్ డిడి. శ్రీమతి రమాదేవి, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి కనక దుర్గా భవాని, డిస్ట్రిక్ట్ బి.సి.వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ వెంకటయ్య, సెట్నల్ సి.ఈ.ఓ శ్రీ పుల్లయ్య, ఎస్.పి.డి.సి.ఎల్ ఎస్.ఈ శ్రీ విజయకుమార్ రెడ్డి,వివిధ క్రీడా కోచ్ లు, జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment