ఎందరోమహానుభావుల త్యాగాల ఫలితంగా భారత దేశానికిస్వాతంత్ర్యం సిద్ధించింది.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*ఎందరోమహానుభావుల త్యాగాల ఫలితంగా భారత దేశానికిస్వాతంత్ర్యం సిద్ధించింది*



*జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి*


ఎందరోమహానుభావుల త్యాగాల ఫలితంగా భారత దేశానికిస్వాతంత్ర్యం సిద్ధించిందని 75 వసంతాలు కావస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల

మేరకు ఆగష్టు 1 నుండి 15 వ తేది వరకు పలు విధాల కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు

జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

గురువారం ఉదయం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండలం

ఉండవల్లి సెంటర్ నుండి ఉండవల్లి గుహల వరకు జరిగిన హెరిటేజ్ వాక్ లో జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఆరీఫ్ హాఫిజ్, సంయుక్త కలెక్టర్ జి. రాజ కుమారి, తెనాలి సబ్

కలెక్టర్ నిధి మీనా, రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి. లక్ష్మణ రెడ్డి, గుంటూరు

మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు

భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి

హెరిటేజ్ వాక్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరు త్రివర్ణపతాకాన్ని చేతపట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ హెరిటేజ్ వాక్ ఉండవల్లి

గుహల వరకు సాగింది. ఉండవల్లి గుహలలోని అలనాటి శిల్పకళలలను చూసి తన్మయత్వం

పొందారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మీడియా వారితో మాట్లాడుతూ కేంద్ర

రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆగష్టు 1 వ తేది నుండి 15 వరకు వివిధ కార్యక్రమాలు

చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా

దేశంలోనే ప్రసిద్ధి గాంచిన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఉండవల్లి గుహలను చూడడం ఎంతో

ఆనందంగా ఉందన్నారు. త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు జాతి గర్వించదగ్గ

మహానుభావుడన్నారు. వారు రూపొందించిన మువ్వెన్నెల పతాకాన్ని ఆగష్టు 13 నుండి 15 వ

తేది వరకు ప్రతి ఇంటి మీదాఎగురవేసేందుకు కార్యక్రమాలు రూపొందించడం జరిగిందన్నారు.

జిల్లా ఎస్పీ ఆరీఫ్ హాఫిజ్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పిలుపు మేరకు పోలీసు శాఖ

తరపున హెరిటేజ్ వాక్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపధ్యంలో ఆగష్టు 15

వ తేదిన పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కవాతు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నట్లు

తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. అనిల్ కుమార్, మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్

కమీషనర్ శారదా దేవి, అడిషనల్ కమీషనర్ హేమమాలినిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి

కే.చంద్ర శేఖర రావు, డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, తాడేపల్లి తహశీల్దార్ శ్రీనివాసులు రెడ్డి,

హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, బీసీ కార్పొరేషన్ ఈ.డి దుర్గాబాయ్, ఐసీడీఎస్ పీడీ

మనోరంజని, గ్రౌండ్ వాటర్ డీడీ వందనం, ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే ఏ.డీ రూపా నాయక్, జిల్లా

టూరిజం అధికారి నాయుడు, జౌళి మరియు చేనేత శాఖ ఏ.డీ వనజ, వివిధ శాఖలఅధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Comments