*ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలి
* ...
ఏలూరు, ఆగస్టు 23 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ప్రగతిపై అధికారులు నిబద్ధతతో పనిచేసి సంపూర్ణ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉపాధిహామీ, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు, నాడు-నేడు, వై.ఎస్.ఆర్. అర్బన్ క్లీనిక్ లు, హౌసింగ్, ఇళ్లపట్టాలు, 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం, స్పందన గ్రీవెన్స్, గడప గడపకు మన ప్రభుత్వం లో అందిన గ్రీవెన్స్, నేషనల్ హైవేస్ కు సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్ధానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, అడిషనల్ ఎస్పీ చక్రవర్తి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, సమస్యలు ఎక్కడున్నాయో సమీక్షించుకొని వాటిని అధిగమించేలా అడుగులు వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్స్, నాడు - నేడు కార్యక్రమాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, ఈ పథకాలకు నిధుల కొరత కూడా లేదని అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన పనులకు చెల్లింపులు జరిగాయని, మిగిలిన పనులు పూర్తయిన తదుపరి చెల్లింపులు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆశయాలను దృష్టిలో పెట్టుకొ ని కలెక్టర్లు ఆ కార్యక్రమాలను పూర్తిచేయాలని సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు సగటు వేతనం రూ.205/-లుగా ఉందని, దీనిని రూ.240/-లకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్పందన పిర్యాదుల పరిష్కార విషయంలో నాణ్యతతో పరిష్కారం చేయాలన్నారు. స్పందనలో పరిష్కారం చేసిన ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఫొటోలు అప్ లోడ్ చేయాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులతో మాట్లాడుతూ గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వీడియో కాన్ఫరెన్స్ లో నిర్ధేశించిన ప్రకారం జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను ముఖ్యంగా ప్రాధాన్యతా పథకాల అమల్లో మరింత పూర్తి పురోగతి తీసుకువచ్చేలా కృషిచేయాలన్నారు. పేదలందరికి ఇళ్లుకింద చేపడుతున్న పనుల విషయంలో కన్వర్షన్ పై మరింత దృష్టి పెట్టాలన్నారు.
సమావేశంలో జెడ్పి సిఇఓ రవికుమార్, పంచాయితీరాజ్ ఎస్ ఇ చంద్రభాస్కరరెడ్డి, డ్వామా పిడి డి. రాంబాబు, హౌసింగ్ పిడి వేణుగోపాల్, డిఆర్డిఏ పిడి విజయరామరాజు, మైనార్టీ కార్పోరేషన్ ఇడి కె. శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment