రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబుతో కలిసి పోరాడుదాం.



 *- రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబుతో కలిసి పోరాడుదాం* 


 *- ఆదర్శ రాజకీయాల్లో భాగస్వాములు కండి* 

 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 



గుడివాడ, ఆగస్టు 5 (ప్రజా అమరావతి): రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబునాయుడుతో కలిసి పోరాడుదామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ పిలుపునిచ్చారు. శుక్రవారం శిష్ట్లా లోహిత్ గుడివాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రమే శాశ్వతం అని చంద్రబాబు చెబుతూ వస్తున్నారని గుర్తు చేశారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందు కోసం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి ఉందన్నారు. పార్టీ సభ్యుడిగా గుర్తింపు పొందిన వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందన్నారు. పేద కుటుంబాల కార్యకర్తలు సంక్షేమ నిధి నుండి లబ్ధి పొందవచ్చన్నారు. పేద కుటుంబాల పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించే స్కూల్లో ప్రవేశం ఉంటుందన్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరితే రూ. 40 వేల రీఎంబర్స్మెంట్, నిర్ధేశిత ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు, రాయితీలు వంటి అనేక ప్రయోజనాలు చేకూరతాయన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో చేరి ఆదర్శ రాజకీయాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గోదావరి వరదలు, భారీ వర్షాల కారణంగా ఐదు జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. చంద్రబాబు స్వయంగా మారుమూల ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారన్నారు. పి.గన్నవరం, రాజోలు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, పోలవరం, రంపచోడవరం తదితర నియోజకవర్గాల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులను పరిశీలించారని చెప్పారు. లంక గ్రామాలు, పోలవరం విలీన మండలాల్లో దారుణ పరిస్థితులను చూసి చంద్రబాబు కలత చెందారన్నారు. బాధితులను సహృదయంతో ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా చంద్రబాబు లేఖ రాశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో బాధితులకు ఇచ్చిన పరిహారానికి సంబంధించిన జీవోలు 9, 14 లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్టు శిష్ట్లా లోహిత్ చెప్పారు.

Comments