తాడేపల్లి (ప్రజా అమరావతి);
*ఉత్సాహంగా... ఉత్తేజంగా...*
*తాడేపల్లినులకపేటలో వందలాదిమంది విద్యార్థినీవిద్యార్థులతోస్ఫూర్తి ప్రదర్శన*
*ర్యాలీనిప్రారంభించిన*తాడేపల్లితహశీల్దార్ వాకా శ్రీనివాసులురెడ్డి*
*4కి.మీ.భారీప్రదర్శన ఇళ్ళలోనుండి* *బయటకు వచ్చి* *ప్రదర్శనతిలకించిన*నులకపేట, ప్రకాష్ నగర్,శివదుర్గాపురం ప్రజలు*
తాడేపల్లి
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.... అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో గురు
వారంవందలాదిమంది విద్యార్థినీ విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇటీవల కాలంలో ఇంత పెద్దఎత్తున జరిగిన ప్రదర్శన ఇదేనని స్థానికంగా చర్చనీయాంశమైంది. ముందుగా జాతీయ జెండాను పట్టుకొని 75మంది బాలికలు నడవగా వారి వెనుక 125 మంది విద్యార్థులు అల్లూరి సీతారామరాజు వేషధారణ
తో కదం తొక్కారు. ఉత్సాహంగా.... ఉత్తేజంగా సాగిన ప్రదర్శన ముందుభాగాన సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి కన్వీనర్ గాదె సుబ్బారెడ్డి జాతీయ జెండాతో సమితి కార్యకర్తలతో కలిసి ముందుకు సాగారు. నులకపేట, సుందరయ్యకాలనీ, శివదుర్గాపురం, ప్రకాష్ నగర్ మీదుగా తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయం
వరకు సాగిన ఈ ప్రదర్శన స్థానిక ప్రజలను ఆలోచింపచేసింది. దారిపొడవునా స్థానికులు ఇళ్ళలో నుండి బయటకు వచ్చి ప్రదర్శన తిలకించారు. ముందుగా రా
యల్ స్కూల్ దగ్గర ప్రదర్శనను తాడేపల్లి తహశీల్దార్ వాకా శ్రీనివాసరెడ్డి,, రాయల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆజాద్ ప్రారంభించారు. భారీప్రదర్శనగా ప్రారంభమైన ప్రకాష్నగర్లోని ర్యాలీ శ్రీరామ్ హైస్కూల్ దగ్గరకు వచ్చేసరికే
ఆ పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులు కలవడంతో మహాప్రదర్శనగా సాగింది. ప్రదర్శన మొదలైన దగ్గర నుండి చివరి వరకు విద్యార్థులు అత్యంత క్రమశిక్షణతో ప్రదర్శనను కొనసాగించారు. 4కి.మీ. సాగిన ప్రదర్శన ఆయా ప్రాంతాల్లో స్ఫూర్తి
నింపింది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, మహాత్మాగాంధీ, భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్, పుచ్చలపల్లి సుందరయ్య, లక్ష్మీ సెహగల్లకు జోహార్లు అ
ర్పిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రదర్శన ఆసాంతం ఎక్కడా నినాదాల హెూరు తగ్గిందిలేదు. ఈ ప్రదర్శనలో మొత్తం రాయల్ హైస్కూల్, శ్రీరామ్ హైస్కూ
ల్ నుండి 400 మంది విద్యార్థినీ విద్యార్థులు ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీతారామరాజు స్ఫూర్తితో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనీల్ కుమార్, రాష్ట్ర బాధ్యులు గాదె సుబ్బారెడ్డి, సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి కార్యకర్తలు స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.విద్యార్థినీ విద్యార్థులు లక్ష్యం ఏర్పాటుచేసుకొని ముందుకుసాగాలి -ఎల్బి కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బూరగ శ్రీనివాసరావు
ర్యాలీ సందర్భంగా తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సభలో లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బూరగ శ్రీనివాసరావు
మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఏర్పాటుచేసుకొని ముందుకు సాగాలని కోరారు. లక్ష్య సాధనలో వచ్చే ఆటంకాలు, అవరోధాలను అధిగమించి
ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. దేశానికి స్వాతంత్య్రం అనేకమంది త్యాగధనుల రక్తంతో పునీతమై వచ్చిందని చెప్పారు. తమ ప్రాణాలు పోతాయని
తెలిసి కూడా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని 23ఏళ్ళకే ఉరికంభాలెక్కిన భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను ఈ సందర్భంగా స్మరించుకోవలసిన అవసరం ఉం
దని చెప్పారు. రవి అస్తమించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు మన్నెం పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు.సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నేడు కూడాజరుపుకుంటున్నామంటే దేశంకోసం ఆయన చేసిన అసమానమైన త్యాగాలు గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంద
న్నారు. తెల్లదొరలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినా నేటికి ప్రజలకు ఆర్థికస్వాతంత్య్రం ఇంకా రాలేదని పేర్కొన్నారు. అసమానతలతో కూడిన భారతదేశం నేడు మన
ముందుసాక్షాత్కరింపచేస్తుందని అన్నారు. త్యాగధనులు ఏమి ఆశించి తమ ప్రాణాలు అర్పించారో, వారి ఆశయ ఫలాలు నేటికి ఫలించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధానపాత్ర వహించిన మహాత్మాగాంధీని పొట్టన పెట్టుకున్న గాడ్సే వారసులు నేడు పాలన చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచే
శారు. విద్యార్థినీ విద్యార్థులు తమ చుట్టూ జరుగుతున్న మంచి చెడులను గమనించి మంచిని ప్రోత్సహించాలని కోరారు.
సభకు అధ్యక్షత వహించిన సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి కన్వీనర్
గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..మంచి
పుస్తకం కొనుక్కో అన్న మహాకవి మాటలను ఆచరణ రూపంలో పెట్టాలనిసూచించారు. టివిలు, స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత బుక్ రీడింగ్ తగ్గి లుక్ రీడింగ్ పెరిగిందని ఆందోలన వ్యక్తంచేశారు. మంచి పుస్తకానికి మించిన స్నేహితుడు ఎవరూ లేరని, ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయాలకు వెళ్ళి మంచిపుస్తకాలు చదివి
ఉత్తమ పౌరులుగా సమాజానికి సేవలు అందించాలని కోరారు. కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్లలో సుందరయ్య సాంస్కీతిక సేవా సమితి అందించిన సేవల
ను వివరించారు. స్వార్థం లేకుండా చేసే సేవకు అంతం లేదని చెప్పారు. ప్రదర్శనలో పాల్గొన్న రాయల్ హైస్కూల్, శ్రీరామ్ హైస్కూల్, విద్యార్థులకు, ఉపాధ్యాయ
లకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తి నింపిన బాలికలు, అల్లూరి వేషధారణతో స్ఫూర్తి నింపిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో సుందర
య్య సాంస్కృతిక సేవా సమితి నిర్వహించే తదితర సేవా సాంస్కృతిక కార్యక్రమాలకు తమ సహకారం ఇవ్వాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను,ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment