భీమవరం (ప్రజా అమరావతి);
పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలు పూర్తిస్థాయిలో పర్యవేక్షించాల
ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జరిగిన పాఠశాల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వివిధ పాఠశాలల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దాలని ఆమె సూచించారు. పాఠశాలల్లో పరిశుభ్రత మెరుగుపరచాలని ఆమె అన్నారు. పాఠశాలలో భాషాభివృద్ధి ప్రోత్సహించాలని, గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను తీసుకొచ్చి పాఠశాలల్లో అందుబాటులో ఉంచాలని ఆమె అన్నారు . ప్రభుత్వం ముద్రించిన టెక్స్ట్ పుస్తకాలను అన్ని ప్రైవేటు పాఠశాలల్లో తీసుకోవాలని అదే రేటుకు విద్యార్థులకు అందజేయాలని ఆమె సూచించారు. నాడు -నేడు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె సూచించారు. విద్యా కానుక లో ఇంకా రావలసిన వస్తువులను త్యరితగతిన వచ్చే విధంగా చూసి విద్యార్థులకు అందజేయాలని ఆమె అన్నారు. ప్రతి పాఠశాలను సచివాలయ స్థాయిలో పర్యవేక్షించేందుకు 1.వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, 2. మహిళా పోలీస్ ,3. ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ఏఎన్ఎం /ఆశ నలుగురు ఆయా సచివాలయం పరిధిలో వారంలో కనీసం రెండుసార్లు పాఠశాలను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో పర్యవేక్షణలో గుర్తించిన అంశాలను యాప్ లో అప్లోడ్ చేయాలని ఆమె ఆదేశించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం , మంచినీరు, మరుగుదొడ్లు , పరిసరాల పరిశుభ్రత, పరికరాల నాణ్యత, మరమ్మతులు , నాడు -నేడు పనులు , పిల్లల భద్రత, బాల్యవివాహాలు , దిశ యాప్ డౌన్లోడ్, ఫిర్యాదులు, ఫోక్సో యాక్ట్ తదితర వాటిని నలుగురు సభ్యుల కమిటీ పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి ఆర్ వి రమణ , డి ఎల్ డి ఓ భీమవరం అప్పారావు , నరసాపురం డిఎల్ డి వో మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు .
addComments
Post a Comment