రేపు నరసరావుపేటలో భారీ ఫ్లాగ్ మార్చ్ : కలెక్టర్ "శివశంకర్" వెల్లడి

 రేపు నరసరావుపేటలో భారీ ఫ్లాగ్ మార్చ్ : కలెక్టర్ "శివశంకర్" వెల్లడి పల్నాడు జిల్లా, 9 ఆగస్టు,  ( ప్రజా అమరావతి ) : ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా పల్నాడు జిల్లాలో ఆగస్టు 15 వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగే పలు కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నరసరావుపేట పట్టణంలో "పల్నాడు ఫ్లాగ్ మార్చ్" నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పరిశీలించారు. స్థానిక శ్రీ సుబ్బరాయ - నారాయణ కళాశాల నుంచి డీ.ఎస్.ఏ  స్టేడియం వరకు "పల్నాడు ప్లాగ్ మార్చ్" కార్యక్రమం జరగనుంది. కార్యక్రమాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కళాశాలలోని క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. పల్నాడు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా    1000 మీటర్ల జాతీయ జెండా మార్చ్ కార్యక్రమం, కళాకారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పల్నాడు జిల్లా ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేందుకు, దేశ సమగ్రతను కాపాడే విధంగా "పల్నాడు ప్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్న మన్నారు. ఎస్ ఎస్ ఎన్ కళాశాల నుంచి సత్తెనపల్లి రోడ్డులోని డి ఎస్ ఏ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వినాయకం, పలు శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Comments