నెల్లూరు, ఆగస్టు 11 (ప్రజా అమరావతి):--మన దేశ సమగ్రతను కాపాడేందుకు, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు సైనికులు ఎంతగానో పాటుపడుతున్నార
ని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు కొనియాడారు.
గురువారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీర సైనికుల సంస్మరణ లు ,యుద్ధ వీరనారీమణులు, క్షతగాత్రులైన సైనికుల సత్కార కార్యక్రమం జరిగింది.
పాకిస్తాన్ దళాల చేతిలో క్షతగాత్రులైన చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సిపాయి ర్యాంకు వీర సైనికులు శ్రీ కొప్పల పెంచలయ్య ను జిల్లా కలెక్టర్ సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అలాగే ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన లాన్స్ నాయక్ ర్యాంకు శ్రీ మోదంపురి పాండురంగారావు ఎల్ టి టి ఈ లతో పోరాటంలో అమరులయ్యారు. వారి త్యాగాన్ని స్మరించుకుంటూ వారి సతీమణి శ్రీమతి వీరనారి కుసుమకుమారిని జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా జిల్లాలోని కలువాయి గ్రామానికి చెందిన లాన్స్ నాయక్ ర్యాంకు శ్రీ దాసినేటి పెంచల నరసింహయ్య ప్రయాణిస్తున్న పదాతిదళం పోరాట వాహనం బోల్తాపడి పేలడంతో అమరులయ్యారు. వారి త్యాగాన్ని స్మరించుకుంటూ వారి సతీమణి శ్రీమతి వీరనారి ధనమ్మ ను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో పోరాటం చేసి అమరులైన వీర సైనికులను స్మరించుకోవడం, వీరనారీలను క్షతగాత్రులైన సైనికులను సన్మానించుకోవడం గౌరవంగా భావిస్తున్నామన్నారు.ఈ ముగ్గురు సైనికులు అందించిన స్ఫూర్తి, చూపిన పోరాట పటిమ మనందరికీ శిరోధార్యమన్నారు. పేద కుటుంబాలకు చెందిన మాజీ సైనికులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. వారికి వ్యవసాయ భూమి ఇవ్వడం జరుగుతుందన్నారు. 10- 15 సంవత్సరాల తర్వాత వారు అవసరమైతే ఆ భూమిని విక్రయించుకునే వీలు కల్పించిందన్నారు. ఇందుకోసం ఎన్ఓసీలు సకాలంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జగనన్న గృహ నిర్మాణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని, అందులో మాజీ సైనికులకు కూడా గృహాలు మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే కొత్తగా ఎంఐజి లేఔట్లలో కూడా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా నుడా, కావలి ప్రాంతాలలో స్థలాలు కేటాయిస్తామన్నారు. దేశ భద్రతకు సంబంధించి కొత్తగా ఆర్మీ ,నేవీ ,ఎయిర్ ఫోర్స్ ల్లో నియామకాలు జరుగుతున్నాయన్నారు.
వచ్చే సెప్టెంబర్ నెల 18 వ తేదీ నుండి నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో అగ్నిపథ్ పథకం క్రింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత వీలైనంత ఎక్కువమంది ఎంపిక అయ్యేవిధంగా వారికి కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతంలోను , పోలీసు శిక్షణ కేంద్రంలో ను రెండు బ్యాచ్ల్లో పోలీస్ శాఖ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎస్సి, ఎస్ టి ,బి సి వంటి బలహీన వర్గాల యువతకు ముఖ్యంగా శిక్షణ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా కొడవలూరు మండలం రామాపురం గ్రామ నత్తానికి చెందిన పదవీ విరమణ పొందిన సుబేదార్ మేజర్ ఎస్. .జి. భాష తన కుమారుడు అఖిల్ ను జిల్లా కలెక్టర్ కు పరిచయం చేస్తూ తన కుమారుడు లెఫ్టినెంట్ గా ఎంపిక అయ్యారని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో శిక్షణ పొంది, రాజపుత్ రెజిమెంట్ లో కమిషన్ తీసుకున్నారని, జమ్మూ కాశ్మీర్ లో నియామకం పొందాడ ని జిల్లా కలెక్టర్ కు వివరించారు. దీంతో జిల్లా కలెక్టర్ వారి కుటుంబాన్ని అభినందించారు.
అనంతరం ఎన్సీసి క్యాడేట్ లతో నిర్వహించే ర్యాలీని జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రారంభించారు. ఎన్సిసి క్యాడేట్లు భారత్ మాతాకీ జై, మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీ రమేష్ జిల్లా ఎసి సంక్షేమ సాధికారత అధికారి శ్రీమతి రమాదేవి, బీసీ సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీమతి కనకదుర్గ భవాని, పలువురు ఎన్సిసి క్యాడేట్లు సైనిక సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment