నేను విన్నాను, నేను ఉన్నాను అన్న మాట నిలబెట్టుకున్నారు.


అమరావతి (ప్రజా అమరావతి);


*జగనన్న తోడు – చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం*


*క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమచేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ)*


అన్నా, మీరు పాదయాత్రలో చిరువ్యాపారుల ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను విన్నాను, నేను ఉన్నాను అన్న మాట నిలబెట్టుకున్నారు.


అధిక వడ్డీలతో వడ్డీ వ్యాపారస్తులు జలగల్లా పీడించుకు తినే ఆ రోజులు మరిచిపోయి నవ్వుతూ మా అన్న మాకు ఉన్నాడన్న సంతోషం చిరువ్యాపారుల్లో కనిపిస్తుంది. మేం గడప గడపకూ కార్యక్రమంలో వెళ్ళినప్పుడు వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చిరువ్యాపారుల కుటుంబాలను ఆదుకోవడం, వారి వడ్డీలను కూడా మీరే చెల్లిస్తున్న విధానం గొప్పది. ఆ కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారు. మా అన్న, మా తమ్ముడు మాకు అండగా ఉన్నారన్న సంతోషం వారిలో కనిపిస్తుంది. ప్రజల ఆనందాన్ని మీతో పంచుకోవడం సంతోషకరం. 


*ఆదిమూలపు సురేష్, మున్సిపల్‌ శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, సీఎంగారు మీ ఆలోచనా విధానం, మీ భావజాలం ఒకటే, సమాజంలో ఏ వర్గం, ఏ వ్యక్తి అభివృద్ది, సంక్షేమానికి దూరం కాకూడదన్నదే, అభివృద్ది, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న మీ ఆలోచన వినూత్నం, అనుసరణీయం, ఆచరణీయం, స్పూర్తిదాయకం. జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి, కాల్‌మనీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం. జగనన్న తోడు చిరువ్యాపారులకు నిజమైన తోడుగా నిలిచింది. ఎలాంటి అవినీతి, దళారులకు, కమీషన్లకు, లంచాలకు ఆస్కారం లేకుండా నగదు బదిలీ ద్వారా రూ. 1.65 లక్షల కోట్ల పైచిలుకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మీ పాలన స్పూర్తిదాయకం, సెలవు.

Comments