అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజని.
అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న సింధు, రజనీలను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామన్న సీఎం శ్రీ వైఎస్ జగన్.
ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి సింగిల్స్‌లో పసిడి పతకం గెలిచిన పీవీ సింధు, తాను సాధించిన పతకాలను సీఎం శ్రీ వైఎస్ జగన్‌కు చూపిన సింధు.
కామన్వెల్త్ గేమ్స్ మహిళల హాకీలో గోల్‌కీపర్‌గా వ్యవహరించిన ఇ.రజని, కాంస్య పతకం సాధించిన ఉమెన్స్ హాకీ టీమ్, హాకీ టీమ్ ఆటోగ్రాఫ్‌లతో కూడిన హాకీ స్టిక్, టీమ్ టీ షర్ట్‌ను సీఎంకు బహుకరించిన రజని
రజనికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, సింధు, రజని కుటుంబ సభ్యులు.
addComments
Post a Comment