నెల్లూరు,ఆగస్టు9 (ప్రజా అమరావతి):-ఈనెల 10వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకు ఆజాదీకాఅమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మాజీ రాష్ట్రపతి శ్రీవి.వి.గిరి గారి జయంతి వేడుకలు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీ పి. శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు ఉదయం శ్రీ వి.వి.గిరి గారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, సాయంత్రం 6 గంటలకు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాయకుల స్వామి దేవస్థానంలో హారతులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వేడుకలకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు విచ్చేసి జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నామన్నారు.
addComments
Post a Comment