రాజభవన్ ఘోరావ్ ను జయప్రదం చేయండి

 *రాజభవన్ ఘోరావ్ ను జయప్రదం చేయండి**గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిరసనలు తెలపండి*


*ఏపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి*


గుంటూరు (ప్రజా అమరావతి): రేపటి రోజున దేశవ్యాప్తంగా జరిగేటటువంటి పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ఏపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి పిలుపినిచ్చారు. దేశంలో నిత్యవసర ధరలు విపరీతంగా పెరగటం, భారతజాతి మీద ప్రభావం చూపిస్తున్నాయని, జీఎస్టీ, ద్వారాగా ప్రజా జీవితం సమాజ వ్యవస్థ,  స్తంభించిపోవటం జరుగుతుందని దుయ్యబట్టారు. నిరుద్యోగం పెరిగిపోవడం, యువత జీవితంతో చెలగాటమాడటం, వీటన్నిటికీ భారతీయుల పక్షాన ప్రశ్నించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని అన్నారు. కాబట్టి రేపు దేశవ్యాప్తంగా ప్రజా ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకి కాంగ్రెస్ శ్రేణులు భాగస్వాములై ఈ పాలకులకు కనువిప్పు కలిగించాలని మస్తాన్ వలి అన్నారు.

Comments