పేద విద్యార్థుల ఉన్నత విద్యకు తోడుగా ‘జగనన్న విద్యాదీవెన*పేద విద్యార్థుల ఉన్నత విద్యకు తోడుగా ‘జగనన్న విద్యాదీవెన


’.*


-మంత్రి శ్రీ జోగి రమేష్ గారు.


పిల్లలకు మనమిచ్చే నిజమయిన ఆస్థి విద్య అన్న ఏకైక దార్శనికుడు సీఎం జగన్ గారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ గారు ఒక ప్రకటనలో కొనియాడారు.


నాణ్యమైన విద్య దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు మరో ముందడుగు వేస్తూ నేడు విద్యా  దీవెన క్రింద  పెడన నియోజకవర్గంలో అర్హులైన 4,844 మంది విద్యార్థులకు 3 కోట్ల 37 లక్షల రూపాయలు నేరుగా వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు నేడు జమ చేసిన సందర్భంగా మంత్రి శ్రీ జోగి రమేష్ గారు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 


ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం ద్వారా పేద విద్యార్థులకు విలువైన విద్య అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు,రానున్న రోజుల్లో 20 వేల ఖరీదు చేసే  బైజూస్ లాంటి ఈ కంటెంట్‌ ను విద్యార్థులకు  అందేలా ఒక వైపు ఏర్పాట్లు చేస్తూ మరోవైపు 8వ తరగతి చదువుతున్న 4.7 లక్షల మందికి ఈ సెప్టెంబర్‌ నాటికి ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రి శ్రీ జోగి రమేష్ గారు వివరించారు.


ముఖ్యమంత్రిగా జగన్ గారు తీసుకొచ్చిన విద్యా సంస్కరణాల వలన 2018 -19  తో పోల్చితే  ప్రభుత్వ పాఠశాలల్లో 7 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరడం వల్ల, గతానికి భిన్నంగా చాల ప్రభుత్వ పాఠశాలలో సీట్లు లేవు అని బోర్డులు పెట్టడం జరిగిందిని విద్యార్థులు ఉన్నత విద్య కొరకై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న గొప్ప చర్యలను విద్యావేత్తలు ఎంతగానో ప్రశంసిస్తున్నారని మంత్రి శ్రీ జోగి రమేష్ గారు తమ ప్రకటనలో వెల్లడించారు.


ఈరోజు జగనన్న విద్యా దీవెన పధకం ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులందరూ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి ,రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికై తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి శ్రీ రమేష్ గారు సూచించారు.

Comments