నెల్లూరు, (ప్రజా అమరావతి);
తిరుమల తిరుపతి దేవస్థానం, విపిఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గత రెండు రోజుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా జరుగుచున్నవని, జిల్లా వాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని భగవంతుని కృపకు పాత్రులు కావాల
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, విపిఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 16వ తేదీ నుండి నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం జరుగుచున్న పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర రెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సంధర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం, విపిఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 16వ తేదీ నుండి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలను ఘనంగా జరుగుచున్నవన్నారు. గత రెండు రోజుల నుండి జరుగుచున్న స్వామి వారి సేవల్లో వేలాది మంది భక్తులు అలాగే సర్వదర్శనంలో లక్షలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని ఒక వరంగా భావించి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని మంత్రి తెలిపారు. టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి, కార్యనిర్వహణ అధికారి శ్రీ ఏవి ధర్మారెడ్డి సహకారంతో రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల సౌజన్యంతో వైభవోత్సవాలు అత్యంత ఘనంగా వైభవంగా జరుగుచున్నవని, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకు, టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి, కార్యనిర్వహణ అధికారి శ్రీ ఏవి ధర్మారెడ్డి లకు హృదయ పూర్వక ధన్యవాదాలను తెలుపుతున్నట్లు ఈ సంధర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుచున్నవని, నెల్లూరు జిల్లా ప్రజలు తిరుమలకు వెళ్లకుండానే శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భాగ్యం ఈ వైభవోత్సవాల ద్వారా కల్పించిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకు హృదయ పూర్వక అభినందనలు తెలియచేశారు
addComments
Post a Comment