పరిపాలన సంస్కరణల ద్వారా సమాజంలో ఉన్న పేదరిక నిర్మూలనే లక్ష్యం


 రామచంద్రపురం (ప్రజా అమరావతి);


 *పరిపాలన సంస్కరణల ద్వారా సమాజంలో ఉన్న పేదరిక నిర్మూలనే లక్ష్యం


గా రాష్ట్ర* *ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు: రాష్ట్ర మంత్రి శ్రీ చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ.


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో సోమవారం ఉదయం విజయ ఫంక్షన్ హాల్ లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించిన   " *థాంక్యూ సీఎం సార్* " కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందాలని, ప్రభుత్వం నుండి పొందే అన్ని సేవలు అవినీతికి తావు లేకుండా ప్రతి కుటుంబానికి అందాలనె సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి,

 ప్రతి పేదవానికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కృషి అభినందనీయమని అన్నారు.

 గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి రెండు సంవత్సరములు పూర్తయిన సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న  743 మంది సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయడం జరిగిందని  తెలియజేశారు.

 ప్రతి సచివాలయ ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని ప్రతి పేదవానికి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.

 అనంతరం విజయ ఫంక్షన్ హాల్ నుండి రామచంద్రపురం పట్టణంలోని గాంధీ విగ్రహం వరకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నిర్వహించిన  బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,సర్పంచ్ లు, గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్కొన్నారు.



Comments