శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
దేవాలయ అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం వారు దేవస్థానంనకు మంజూరు చేసిన రూ.70 కోట్ల రూపాయల ఆలయ అభివృద్ధి పనులలో భాగముగా ఘాట్ రోడ్ ద్వారా శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తుల భద్రత దృష్ట్యా కొండ చరియలు విరిగిపడు ప్రమాద నివారణ మరియు తీవ్రత ను తగ్గించుటకు జరుగుచున్న రాక్ మిటిగేషన్ పనులలో మిగిలిన కొంత భాగం పనులు జరుగుచున్నందున భక్తుల రక్షణ దృష్ట్యా కాంట్రాక్టర్ వారి అభ్యర్థన మేరకు ఘాట్ రోడ్ ద్వారా ది.01-08-2022 నుండి ది.03-08-2022 వరకు వాహనములను నిలుపుదల చేసిన విషయం విదితమే.
సదరు రాక్ ఫాల్ మిటిగేషన్ పనులలో మెటీరియల్ లభ్యత లేనందువలన మిగిలిన కొంత భాగం పనులు తిరిగి ఈరోజు అనగా ది.01-08-2022 న ఘాట్ రోడ్ నిలుపుదల చేసి, పనులను కాంట్రాక్టర్ వారు ప్రారంభించి కొనసాగించడం జరుగుచున్నది. మరి కొన్ని రోజులపాటు ఈ పనులు కొనసాగు అవకాశం ఉన్నదని తెలియజేయడమైనది. అనంతరం త్వరలో తిరిగి ఘాట్ రోడ్ ద్వారా యధావిధిగా వాహనములు అనుమతించబడును.
addComments
Post a Comment