ఆత్మకూరు డివిజన్లో స్పందన కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్
నెల్లూరు ఆగస్టు 22 (ప్రజా అమరావతి):ఈనెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ బాబు శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం ఆత్మకూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా చేజర్ల మండలం పెల్లేరు గ్రామానికి చెందిన పలువురు ఎస్సీలు ఆల్ ఇండియా అంబేద్కర్ మిషన్ నాయకులు శ్రీ నంద ఓబులేసు నేతృత్వంలో తమకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కొందరు ఆక్రమించుకున్నారని తమ భూములను తమకు స్వాధీనం చేయాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ వెంటనే స్పందిస్తూ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రతి మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చి అర్జీల పరిష్కారంపై సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రజల నుండి అందే స్పందన అర్జీలను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈనెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన ఉన్నందున నెల్లూరు, సంగం బ్యారేజీల వద్ద డాక్టర్ వైఎస్ఆర్, శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డిల విగ్రహాలను పూలతో అందంగా అలంకరించాలన్నారు. రెండు చోట్ల పైలాన్లు, హేలిప్యాడులు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. హెలిప్యాడు నుండి పైలాను, విగ్రహాలు, బహిరంగ సభ ప్రదేశాలకు చేరుకునే రూట్ మ్యాప్ పక్కాగా సిద్ధం చేయాలన్నారు. రెండు బ్యారేజీలకు సంబంధించి చిన్న చిన్న పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. అవసరమైన చోట తక్షణమే అప్రోచ్ రోడ్లను వేయాలని సూచించారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందాల్సిన వివిధ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే తయారుచేసి ప్రభుత్వానికి పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా రీ సర్వే, భూసేకరణ, నాడు నేడు, నవరత్నాలు పేదలందరికి ఇల్లు తదితరాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లేబర్ బడ్జెట్ను నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ మూడో డోసు టీకాలు వేసే కార్యక్రమం జిల్లాతో పాటు ఆత్మకూరు నియోజకవర్గం లో కూడా మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు.
తదనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ అత్యంత బాధ అనేది ఇస్తున్నారు అన్నారు అందుకే వారు ప్రతివారం స్పందన అర్జీలజిల్లా పరిష్కారం పై సమీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అవసరాలను తీర్చే పరిష్కార వేదికగా ఈ స్పందన కార్యక్రమం కొనసాగుతోందన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సజావుగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు ప్రతి సోమవారము నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో సుమారు 300 నుంచి 400 అర్జీలు వస్తున్నాయన్నారు. మండల స్థాయిలో కూడా ఇదే తరహాలో అర్జీలు వస్తున్నాయన్నారు
క్షేత్రస్థాయిలో స్పందన కార్యక్రమం ఎలా జరుగుతుందో తీరుతెన్నులను పరిశీలించేందుకు ఆత్మకూరు ఆర్డిఓ కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా భూ సమస్యలు పింఛన్లు రేషన్ కార్డులు ఇంటి స్థలాల వంటి సేవలు కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయన్నారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని నెల్లూరు సంగం బ్యారేజీలను ప్రారంభించనున్నారన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు పూర్తికావచ్చాయన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అయిన శ్రీ అంబటి రాంబాబు స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం ఖరారు చేయుటకు సంగం బ్యారేజీని సందర్శిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో శ్రీమతి కరుణకుమారి,తెలుగు గంగ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ శ్రీ టి బాపిరెడ్డి, ఎస్ డి సి శ్రీమతి సువర్ణమ్మ, డి ఆర్ డి ఏ, డ్వామా పీడీలు శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ వెంకటరావు, టిజిపి సీఈ శ్రీ హరి నారాయణ రెడ్డి, సోమశిల ప్రాజెక్టు ఎస్.ఈ. శ్రీ వెంకటరమణారెడ్డి, డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర్లు, ఏపీఎంఐపీ పిడి శ్రీ శ్రీనివాసులు, ఉద్యాన శాఖ ఏడి శ్రీ సుబ్బారెడ్డి, ఎన్ ఐ సి డి ఐ ఓ శ్రీ సురేష్ కుమార్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్. ఈ. శ్రీ విజయకుమార్, జలవనుల శాఖ ఎస్.ఈ. శ్రీ కృష్ణమోహన్, ఆర్టిసి డివిజన్ మేనేజర్ శ్రీ చిరంజీవులు, ఎంవిఐ శ్రీ మురళి, తదితర శాఖల జిల్లా అధికారులు, డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment