ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు పోలవరం పోలీస్ స్టేషన్ వద్ద గిరి నేస్తం కార్యక్రమమును నిర్వహించినారు.

 ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు పోలవరం  పోలీస్ స్టేషన్ వద్ద గిరి నేస్తం కార్యక్రమమును నిర్వహించినారు.



 ఏలూరు (ప్రజా అమరావతి); జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో నివాసం ఉంటున్న గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు స్టడీ మెటీరియల్ అందిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గా ఉన్నప్పుడు నుండి ఏజెన్సీ ప్రాంతాలలో నాడు నేడు అనే నినాదంతో యువత చెడు మార్గాల వైపు పయనించకుండా వారిలో నిక్షిప్తమైన ప్రావీణ్యతను వెలుగు చూసేలాగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలను గురించి ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు అవగాహన కార్యక్రమాలను *గిరి నేస్తం* అనే పేరుతో సమావేశములను ఏజెన్సీ ప్రాంతాలలో నిర్వహించి గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను గురించి వారికి తర్ఫీదులు ఇప్పిస్తున్నారు.


 ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం గ్రామంలో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు, పోలవరం డిఎస్పి శ్రీమతి లతా కుమారి గారు ఆధ్వర్యంలో *గిరి నేస్తం* అనే కార్యక్రమాన్ని నిర్వహించినారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలు అయిన గిరిజన యువత లో చైతన్యం తీసుకొని వచ్చి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించుట కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, నేటి తరం యువత అసాంఘిక కార్యకలాపాల పట్ల ఆకర్షితులు కాకుండా మెరుగైన జీవన విధానానికి పాటుపడేలాగా జిల్లాలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మరీ ముఖ్యముగా ఏజెన్సీ ప్రాంతాలలో నివాసం ఉంటున్న గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఉపయోగించుకుంటూ నాటు సారా తయారు చేయడం అమ్మకాలు చేయడం కోడిపందాలు మరియు జూధాలను ప్రోత్సహించే వారి పట్ల చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తూ, యువత సన్మార్గంగా ప్రయాణించి ప్రభుత్వం వారు అందిస్తున్న సంక్షేమ ఫలాలు గురించి వారికి తెలియజేస్తూ యువతలో ఉద్యోగ అవకాశాల కల్పన కొరకు ఈ ప్రత్యేకమైన గిరి నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగ పోటీ పరీక్షలలో గిరిజన యువత పోటీపడేలాగా వారికి స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందిస్తూ యువతకు మార్గదర్శకాన్ని కల్పిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని ఏజెన్సీ ప్రాంతాలలో చదువుకున్న ప్రతి యువకుడు అంది పుచ్చుకొని ఉద్యోగ అవకాశాలను తీసుకురావాలని దానికి ఎస్పీ గారు వంతు సహాయ సహకారాలను అందిస్తామని గిరిజన యువతకు హామీ ఇచ్చినారు.


ఏజెన్సీ ప్రాంతాలలో నివాసం ఉంటున్న మహిళలు మరియు బాలికల, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి లు, ఏ.ఎన్.ఎంలు విద్యార్థిని లకు  చట్టాలు వాటి యొక్క విశిష్టతను గురించి అవగాహనను కల్పించినారు.


సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా జరిగే అనర్ధాలను గురించి సైబర్ నేరాలు పట్ల అవగాహనను ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని విషయాన్ని గురించి ఏదైనా సైబర్ నేరగాళ్ల వలలో ఎవరైనా చిక్కుకున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1930 కాల్ సెంటర్ గురించి గిరిజన ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి అవగాహనను కల్పించినారు.


ఈ కార్యక్రమంలో గిరిజన యువత పోటీ పరీక్షలకు పోటీపడేలాగా ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ సుమారు 50 మంది డిగ్రి పూర్తి చేసుకున్న గిరిజన యువకులకు ఉచితంగా అందించిన జిల్లా ఎస్పీ గారు.


ఈ గిరి నేస్తం కార్యక్రమంలో పోలవరం డిఎస్పి శ్రీమతి లతా కుమారి గారు, పోలవరం మండలం తాసిల్దార్ గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పోలవరం సిఐ విజయ్ బాబు గారు పోలవరం ఎస్సై శ్రీనివాస్ గారు మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Comments