అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన మేరుగు నాగార్జునఅంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను

ఆకస్మిక తనిఖీ చేసిన మేరుగు నాగార్జునఅమరావతి, ఆగష్టు 21 (ప్రజా అమరావతి):. విజయవాడ లో ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులు ఎక్కడా ఆగకుండా శరవేగంగా జరిగేలా చూడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు.

డా. బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ ప్రాజెక్ట్ లో భాగంగా పీడబ్ల్యుడి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రి నాగార్జున ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విగ్రహం ఏర్పాటు చేయనున్న వేదిక వద్ద జరుగుతున్న కాంక్రీట్ పనులతో పాటు ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించనున్న కన్వెన్షన్ సెంటర్ పనులను కూడా ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. నిర్ణీత గడువులోగా విగ్రహ నిర్మాణ పనులను పూర్తి చేయడం కోసం రాత్రి వేళలో కూడా పనులు చేయడానికి అధికారులు చేసిన ఏర్పాట్లను కూడా సమీక్షించారు. అధికారులు చెప్పిన విధంగానే విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈమధ్య కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పనులు కొంత మందకొడి గా జరిగాయని అయితే ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు ఏవీ లేవు అని అధికారులు ఈ సందర్భంగా మంత్రి కి తెలిపారు. రాబోయే అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని ఈనేపథ్యంలో విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నాగార్జున అధికారులను ఆదేశించారు.


Comments