ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్గి ఉండాలిరాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


*ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్గి ఉండాలి  - జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ప్రత్యూష కుమారి** ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని, తద్వారా మన హక్కులను మనం కాపాడుకోవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రత్యూష కుమారి పిలుపునిచ్చారు. 


 ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఎ చైర్మైన్ వెంకట జ్యోతిర్మయి ఆధేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ ఆవరణలోని ఎస్టీ కళాశాల బాలికల వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు, హర్ ఘర్ తిరంగా, ట్రైబల్స్ యాక్ట్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధినులు జాతీయ పతాకాలను చేతబూని భారత మాతాకీ జై అంటూ భారీ ర్యాలీ చేశారు. అలాగే మానవ హారం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ, మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా జరుపుకుంటున్నా మన్నారు.  నల్సా ఆదేశాలతో మన జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు విస్తృతంగా చేయడం జరుగుతుందని అన్నారు. అందరూ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి మన జాతీయ ఐక్యతను చాటాలన్నారు. అలాగే అందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. 


 అనంతరం మహిళా చట్టాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కె.ఎన్.జ్యోతి,  డీఎల్ఎస్ఎ ప్యానల్ న్యాయవాది ధర్నాలకోట వెంకటేశ్వరరావు, పీఎల్వీలు లక్కోజు ఓంకార్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, ప్రశాంతి, వార్డెన్లు సిహెచ్ శ్రీనివాస్, లక్ష్మీకాంతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image