బసవ ఎక్స్ ప్రెస్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరం
*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
*: శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో మైసూర్ - బాగల్కోట్ - మైసూర్ బసవ ఎక్స్ ప్రెస్ నిలుపుదలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, బెంగళూరు అడిషినల్ డివిజన్ రైల్వే మేనేజర్ లక్ష్మణ్ సింగ్, నార్త్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ పుష్పెంద్ర కుమార్, తదితరులు..*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఆగస్టు 26 (ప్రజా అమరావతి):
*మైసూర్ - బాగల్కోట్ - మైసూర్ బసవ ఎక్స్ ప్రెస్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి వద్దనున్న శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి మైసూర్ - బాగల్కోట్ - మైసూర్ (రైలు నంబర్. 17307 - 17308) బసవ ఎక్స్ ప్రెస్ మార్గ మార్పిడి మరియు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో నిలుపుదలకు జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, బెంగళూరు అడిషినల్ డివిజన్ రైల్వే మేనేజర్ లక్ష్మణ్ సింగ్, నార్త్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ పుష్పెంద్ర కుమార్, తదితరులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడిన అనంతరం శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో మరొక రైలు నిలుపుదల చేయడం ఎంతో సంతోషకరమన్నారు. దీని ద్వారా జిల్లా కేంద్రానికి రాకపోకలు మరింత పెరుగుతాయన్నారు. జిల్లా ప్రజలకు మరొక రైలు సేవలు అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో మైసూర్ - బాగల్కోట్ - మైసూర్, బసవ ఎక్స్ ప్రెస్ నిలుపుదల కోసం కృషిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. బసవ ఎక్స్ ప్రెస్ రైలు సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.*
*ఈ సందర్భంగా బెంగళూరు అడిషినల్ డివిజన్ రైల్వే మేనేజర్ లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతూ మైసూర్ - బాగల్కోట్ - మైసూర్ బసవ ఎక్స్ ప్రెస్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో బసవ ఎక్స్ ప్రెస్ నిలుపుదల చేసేందుకు కోసం ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.*
*మైసూర్ - బాగల్కోట్ - మైసూర్ (రైలు నంబర్. 17307 ) బసవ ఎక్స్ ప్రెస్ ప్రతిరోజు మైసూర్ లో మధ్యాహ్నం 01:25 గంటలకు బయలుదేరి కె ఎస్ ఆర్ బెంగళూరు, గౌరీబిదనూరు, హిందూపురం మీదుగా శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ కు రాత్రి 07:33 గంటలకు చేరుకొని 07:35 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, వాడి, సోలాపూర్ మీదుగా బాగల్కోట్ కి మరుసటి రోజు ఉదయం 11:10 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా ప్రతిరోజు 17308 నంబర్ తో మైసూర్ - బాగల్కోట్ - మైసూర్ బసవ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 02:30 గంటలకు బాగల్కోట్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05:50 గంటలకు శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ కు చేరుకుని 05:52 గంటలకు బయలుదేరి హిందూపురం, గౌరీబిదనూరు, కె ఎస్ ఆర్ బెంగళూరు మీదుగా మైసూర్ కు మధ్యాహ్నం 02:10 గంటలకు చేరుకుంటుంది.*
*ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భాగ్యరేఖ, రైల్వే రైల్వే శాఖ అభిషేక్ గాంధీ, తదితరులు పాల్గొన్నారు.*
addComments
Post a Comment