టీడీపీ నాయకులు, ప్రతిపక్షాలు అభివృద్ది ఎక్కడ ఉంది అంటున్నారు, మీకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు


చీమకుర్తి, ప్రకాశం జిల్లా (ప్రజా అమరావతి);


*చీమకుర్తిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన నాయకులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, ఎమ్మెల్యే, సంతనూతలపాడు*


అందరికీ నమస్కారం, ఈ రోజు ఇద్దరు నాయకుల విగ్రహాల ఆవిష్కరణకు సీఎంగారు రావడం అరుదైన కార్యక్రమం. టీడీపీ నాయకులు, ప్రతిపక్షాలు అభివృద్ది ఎక్కడ ఉంది అంటున్నారు, మీకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు


. మీ రాజకీయాలకు సమాధి కట్టారని, మీ ఉనికి కరువైందని ఏ ఊర్లో అడిగినా చెబుతారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాల ద్వారా రూ. 2,033 కోట్లు వచ్చాయి, అభివృద్ది రూపంలో రూ. 1,054 కోట్లు వచ్చాయి, మొత్తం కలిపి రూ. 3,087 కోట్లు వచ్చాయి. వివిధ పథకాల ద్వారా మా నియోజకవర్గానికి చాలా లబ్ధి జరిగింది. ఈ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యతను స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చూపించాం, సంతనూతలపాడును మరోసారి గెలిపించుకుంటాం, అప్పటివరకూ విశ్రమించం, టీడీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు, రేపు వారు ప్రజల్లోకి వచ్చి ఎలా ఓట్లడుగుతారు, మిమ్మల్ని మళ్ళీ సీఎం చేసుకునేవరకూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు విశ్రమించవు. సెలవు.  


*బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే*


అందరికీ నమస్కారం, నాకు రాజకీయం తెలిసిన తర్వాత నచ్చిన నాయకులు ఇద్దరు, ఒకరు వైఎస్‌ఆర్‌ అయితే మరొకరు జగన్‌ గారు, అన్నా మీ దయ వల్ల, నాన్నగారి దయ వల్ల మేం ఎమ్మెల్యేలయ్యాం, నాన్నగారి చివరి కోరిక మిమ్మల్ని సీఎంగా చూడాలని, నాన్నగారి కోరిక నెరవేరింది, అమ్మను ప్రకాశం జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ చేశారు మీరు, మేం ఎప్పుడూ మీ కుటుంబానికి విధేయులుగా ఉంటాం, మీరు ఏ బాధ్యతలు అప్పగించినా మీ మాట ప్రకారం నడుచుకుంటాం, కొంతమంది నాయకులు సింహాలు, పులులు అంటున్నారు, రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్, ఏ సీఎం చేయని విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు. రాష్ట్రంలో 30 లక్షలు పైగా ఇళ్ళపట్టాలు ఇచ్చిన మహానాయకుడు మన జగన్, మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లా భావించి ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎంగారికి ధన్యవాదాలు.

Comments