అమరావతి (ప్రజా అమరావతి);
*ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్థులతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం*
*టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో కార్యక్రమం*
*జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యాపారస్థుడికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ కరపత్రం విడుదల చేయనున్న లోకేష్*
ఈ కార్యక్రమానికి లోకేష్ తో పాటు హాజరైన మాజీ మంత్రి నెట్టెం రఘురాం,బోండా ఉమ,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,నాగులు మీరా తదితర నేతలు
వ్యాపారస్థుడికి వీర బాదుడు రూపేణ చెత్త పన్ను భారం, బాత్రూం టాక్స్ భారం, బోర్డ్ పన్ను భారం వంటి సమస్యలపై ప్రధాన చర్చ
ఆక్వా రంగం కుదేలు, ఇసుక పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం కుప్పకూలిపోవటం, రేషన్ డీలర్ వ్యవస్థ నాశనం వంటి అంశాలపై చర్చ
J టాక్స్ పేరుతో వ్యాపారస్థుల బెంబేలు
, ఆటో నగర్ల పై ప్రతాపం, పవర్ హాలిడే తో పరిశ్రమలకు తీవ్ర నష్టం, ALD, ACD పేరుతో కరెంటు మీటర్ పై బాదుడు, ఉన్న పరిశ్రమలు పోయే కొత్త పరిశ్రమలు రాని పరిస్థితి వంటి సమస్యలపైనా వ్యాపారుల అభిప్రాయాలు తీసుకొనున్న లోకేష్
సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణను ఈ సమావేశం వేదికగా ప్రకటించనున్న లోకేష్.
*నూనె రామకృష్ణ వ్యాపారస్తుడు* తెనాలి
ముప్పై ఏళ్ల నుండి టెక్స్ టైల్స్ బిజినెస్ లో ఉన్నాను
వైసిపి నాయకుడి ఇంటికి రోడ్డు వేసుకోవడానికి నా షాపు కూలగొట్టారు
అన్ని అనుమతులు ఉన్నా పాత భవనం అని మున్సిపల్ అధికారులు కూల్చేశారు.
టిడిపి నాయకులు నాకు అండగా నిలిచారు.
న్యాయ పోరాటం చేస్తున్న నన్ను పోలీసులు, మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారు.
ఒక్క తెనాలి లోనే ఇలాంటి ఘటనలు 8 జరిగాయి.
*రియల్ ఎస్టేట్ రంగం నరేడ్కో ప్రతినిధి మల్లికార్జున్ రావు.*
ప్రభుత్వం మారిన తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
నిర్మాణ రంగం అనేక ఇబ్బందులు పడుతున్నాం.
ఇసుక దొరక్క, సిమెంట్, ఐరన్ రెట్లు పెరిగి ఇబ్బంది పడుతున్నాం.
రిజిస్ట్రేషన్ ఫీజులు పెరిగి ఇబ్బంది పడుతున్నాం.
జిఎస్టీ కూడా పెను భారంగా మారింది.
దేశ అభివృద్ధి కి ఎంతగానో కృషి చేస్తున్న నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
*పర్చూరు నియోజకవర్గం... రాజేష్ వ్యాపారస్తుడు*
టిడిపి హయాంలో ఇచ్చిన లోన్ తో లైటింగ్, సౌండ్ సిస్టమ్ వ్యాపారం చేశాను.
కరోనా ఎఫెక్ట్ తో వ్యాపారంలో నష్టం వచ్చింది. మళ్ళీ లోన్ కోసం ప్రయత్నించాను. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా లోన్ ఇవ్వడం లేదు. నా దగ్గర పని చేసే 15 మంది కుర్రాళ్లు రోడ్డున పడ్డారు.
*వీరారెడ్డి చెరుకు రసం బండి వ్యాపారం...* విజయవాడ
చెరుకు రసం వ్యాపారం చేసుకునే నన్ను వైసిపి నేతలు వేధించారు.
వ్యాపారం చేసుకోవాలంటే
వైసిపి నేతలకు డబ్బులు ఇవ్వాలని వేధించారు.
ఆత్మహత్య చేసుకుంటా అన్నా కూడా వదలలేదు.
డబ్బు ఇచ్చి చచ్చిపో అని వైసిపి నేతలు అన్నారు.
*శివరాం రెడ్డి... పెద్దకూరపాడు నియోజకవర్గం*
రేషన్ డీలర్ల వ్యవస్థ ని నాశనం చేసి డోర్ డెలివరీ అని కొత్త వ్యవస్థ ని తెచ్చారు.
సక్రమంగా ఉన్న వ్యవస్థ...ప్రజలకి టైం కి రేషన్ అందేది.
ఇప్పుడు డోర్ డెలివరీ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.
చంద్రన్న భీమా తో సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు టిడిపి హయాంలో అమలు అయ్యాయి.
ఇప్పుడు వైసిపి పాలనలో అన్ని పథకాలు రద్దు అయ్యాయ
బెల్లం వ్యాపారస్తుడు...బాలాజీ
పోలవరం నియోజకర్గం
మా బాబాయ్ బెల్లం వ్యాపారం చేస్తారు.
బెల్లం వ్యాపారం చేస్తున్నందుకు అరెస్ట్ ఎస్ఈబి అధికారులు మా బాబాయ్ ని అరెస్ట్ చేసి వేధించారు.
తెల్లవారు జామున పోలీసులు మీ బాబాయ్ పారిపోయారు అని చెప్పారు.
మరుసటి రోజు మా బాబాయ్ మూడు రోజుల తరువాత మా బాబాయ్ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ పై దొరికింది.
పోలీసులు హడావిడిగా కార్యక్రమం పూర్తి చెయ్యాలని ఒత్తిడి చేశారు.
ఎస్ఈబి అధికారులే మా బాబాయ్ ని ఐదు కిలోల బెల్లం ఉందని వేధించి చంపేశారు.
*రమేశ్ కాయిర్ ఇండస్ట్రీ*
కొబ్బరి కాయిర్ తో అనేక ఉత్పత్తులు తయారు చేస్తాం
విద్యుత్ కోతలు, లో ఓల్టేజ్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం రాయితీలు కూడా ఇవ్వడం లేదు.
ఎన్నో పరిశ్రమలు మూతబడుతున్నాయి.
*బోండా ఉమామహేశ్వర రావు...మాజీ ఎమ్మెల్యే*
టిడిపి హాయం వ్యాపారస్తులకు స్వర్ణ యుగం...వైసిపి పాలనలో వ్యాపారస్తులకు సంక్షోభం.
చంద్రబాబు గారిది సమర్థ నాయకత్వం.
జగన్ రెడ్డి అసమర్థ నాయకత్వం. అందుకే వ్యాపారస్తులకు ఈ సమస్యలు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు గారు కరెంట్ ఛార్జీలు పెంచలేదు.
పన్నుల పేరుతో వ్యాపారస్తులను వేధిస్తున్నారు.
*సోమిశెట్టి వెంకటేశ్వర్లు....టిడిపి సీనియర్ నేత*
సైకో సిఎం దెబ్బకి అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
వ్యాపారస్తులకు నిద్ర లేదు. అధికారుల వేధింపులకు భయపడుతున్నారు.
చెత్త పన్ను కట్టలేదని షాపు ముందు చెత్త పోసి పోతున్న చెత్త ప్రభుత్వం.
*దూండి రాకేష్...వాణిజ్య విభాగం అధ్యక్షుడు*
వ్యాపారస్తులను వైసిపి ప్రభుత్వం వేధిస్తుంది.
రాష్ట్రంలో ఏ వ్యాపారస్తుడుకి ఇబ్బంది ఉన్నా టిడిపి వాణిజ్య విభాగం అండగా ఉంటుంది.
పన్నులు, పెరిగిన విద్యుత్ ధరలు ఇలా అనేక ఇబ్బందులతో వ్యాపారం చెయ్యలేని పరిస్థితి వచ్చింది.
చెత్త ముఖ్యమంత్రి పాలన లో చెత్త పన్ను కట్టలేక వ్యాపారస్తులు అనేక బాధలు పడుతున్నారు.
*దువ్వారపు రామారావు...ఎమ్మెల్సీ*
లోటు బడ్జెట్ ఉన్నా చంద్రబాబు గారు ఏనాడు ప్రజలు, వ్యాపారస్తుల పై భారం పెంచలేదు.
వ్యాపారస్తులు ఆనందంగా ఉండాలి అంటే మళ్ళీ టిడిపి అధికారంలోకి రావాలి.
మీ సమస్యలు అన్ని పరిష్కారం అవ్వాలి అంటే టిడిపి అధికారంలోకి రావాలి.
*కోల్లు రవీంద్ర... మాజీ మంత్రి*
అనేక ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులు బయటకి రావాలి. పడుతున్న ఇబ్బందులపై గొంతెత్తాలి.
దేశంలోనే అమరావతి నంబర్ 1 అవుతుందనే జగన్ రెడ్డి కుట్ర చేసి ఆపేసాడు.
వ్యాపారస్తులు జగన్ బానిసలుగా ఉండాలనే అనేక వేధింపులకు గురిచేస్తున్నారు.
addComments
Post a Comment