చట్టసభలు నిర్మాణాత్మకoగా పని చేసినప్పుడే ప్రజా ఉపయోగకర చట్టాలు సాధ్యం



చట్టసభలు నిర్మాణాత్మకoగా పని చేసినప్పుడే ప్రజా ఉపయోగకర చట్టాలు సాధ్యం



ఫాలిఫాక్స్ కామన్వెల్త్ సమావేశంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం


అమరావతి, ఆగష్టు 25 (ప్రజా అమరావతి):

కెనడా దేశం ఫాలీఫాక్స్ లో అంతర్జాతీయ పార్లమెంటరీ కామన్వెల్త్ సమావేశాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు పార్లమెంటరీ వ్యవస్థగా  కొనసాగుతున్న దేశాలు,పలు రాష్ట్రాలు రాజ్యాంగ బద్ధ ప్రముఖులు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం 65వ కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొన్నారు.పలు వర్క్ షాప్ లు, చర్చావేదికల్లో పాల్గొంటూ చట్టసభల నిర్మాణాత్మకమైన పాత్రను స్పీకర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ కార్యకలాపాలను, ప్రభుత్వ పాలనపై.ప్రజా సమస్యలపై, రూల్ ఆఫ్ లా వంటి అంశాల్లో పాటిస్తున్న విధానాలను వివరించారు. చట్టాల రూపకల్పన విషయంలో  సభ్యులు మధ్య  జరిగే లోతైన చర్చ సరికొత్త విషయ ఆవిష్కరణ జరుగుతున్న తీరును ఆయన వివరించారు. పలు దేశాలకు చెందిన చట్టసభల్లో ప్రతినిధులతో ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలనలో చట్టసభలో పాత్ర అంశంపై ఇష్టాగోష్టిలో ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పలు దేశాలకు చెందిన చట్టసభలు కొనసాగుతున్న తీరును,రూల్ పొజిషన్,సభ్యులు పాటించే క్రమశిక్షణ, ప్రజాసంక్షేమం దృష్ట్యా పలు సమస్యలపై  సభల్లో ప్రజా ప్రతినిధుల మధ్య ఆరోగ్యకరమైన చర్చ, పలు అంశాలపై లోతైన విశ్లేషణలు చేసే విధానాన్ని పలువురు శాసన సభాపతులు  వివరించినట్లు సమావేశానికి హాజరైన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.ఈ సందర్భంగా స్పీకర్ తన సతీమణి వాణిశ్రీతో కలిసి హాలిఫాక్స్ లో పలు ప్రదేశాలను సందర్శించారు. సమావేశంలో పాల్గొన్న వ్యక్తులు వ్యక్తపరిచే అభిప్రాయాలు చట్టసభల బలోపేతానికి నాందిగా నిలిచేలా ఉన్నాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.

Comments