విజయవాడ (ప్రజా అమరావతి);
*రాష్ట్ర వ్యాప్తంగా 01 అక్టోబర్, 2022 న అమల్లోకి “వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా”*
• *30 సెప్టెంబర్, 2022 న ముఖ్యమంత్రి చేతుల మీదుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు”,“వైఎస్సార్ షాదీ తోఫా” వెబ్ సైట్ ప్రారంభం*
• *పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాల నివారణ, పాఠశాలల్లో చేరికల శాతం పెంపు, డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం*..
• *దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి*
పిల్లల చదువును ప్రోత్సహించడం.. బాల్య వివాహాలను నివారించడం.. పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం.. డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం లక్ష్యాలుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు", "వైఎస్సార్ షాదీ తోఫా" పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ పథకాలకు సంబంధించిన వెబ్ సైట్ ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 30 సెప్టెంబర్, 2022 న లాంఛనంగా ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 01 అక్టోబర్, 2022 నుండి అమల్లోకి రానున్నాయి.
*వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థికసాయం భారీగా పెంపు* :
వైఎస్సార్ కళ్యాణమస్తులో భాగంగా ఎస్.సి లకు రూ.1,00,000, ఎస్.సి. ల కులాంతర వివాహాలకు రూ.1,20,000, ఎస్.టి. లకు రూ.1,00,000, ఎస్.టి ల కులాంతర వివాహాలకు రూ.1,20,000, బి.సి. లకు రూ.50,000, బి.సి. లో కులాంతర వివాహాలకు రూ.75,000, ముస్లిం, మైనారిటీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.1,00,000, దివ్యాంగుల వివాహాలకు రూ.1,50,000, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40,000 లను అందిస్తోంది ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం..
*చదువును ప్రోత్సహించేందుకు వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి*:
“వైఎస్సార్ కళ్యాణమస్తు”,“వైఎస్సార్ షాదీ తోఫా” పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి. వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలని సూచించిన ప్రభుత్వం.
addComments
Post a Comment