నెల్లూరు (ప్రజా అమరావతి);
ఆహార భద్రతా చట్టం – 2013 ను పటిష్టం గా అమలు పరచాల్సిన బాధ్యత మనపై ఉంద
ని రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ శ్రీ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు.
గురువారం ఉదయం రాష్ట్ర ఆహార కమీషన్ ఛైర్మన్ శ్రీ విజయ ప్రతాప్ రెడ్డి మనుబోలు మండలం,
బద్దెవోలు గ్రామంలోను మరియు మనుబోలు మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను, రేషన్ షాపు డీలర్ పాయింట్ ను సందర్శించి, పిల్లలకు మధ్యాహ్నం భోజనం పధకం అమలు తీరును, రేషన్ బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించారు.
తొలుత ఫుడ్ కమీషన్ ఛైర్మన బద్దెవోలు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనం పధకం అమలును పరిశీలించి, స్టాకు రిజిస్టర్స్ ను, హాజరు రిజిస్టర్ ను తనికీ చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. తదుపరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల తో ఇంట్రాక్టు అయి మధ్యాహ్నం భోజనం అమలు తీరుతెన్నులను తెలుసుకున్నారు.తదుపరి ప్రజాపంపిణీ వ్యవస్థ డీలర్ పాయింట్ ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ మీడియా తో మాట్లాడుతూ, ఫుడ్ కమీషన్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన 5 నెలల కాలంలో 13 జిల్లాలలో పర్యటించానని, అందిన వినతుల మేరకు ప్రజలకు రేషన్ పంపిణీ సక్రమంగా అమలు జరిగేనా చర్యలు తీసుకోవడం తో పాటు అంగన్వాడీ
లకు, పాఠశాలలకు బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా రేషన్ పంపిణీలో దేశంలోనే మొదటిగా మన రాష్ట్రంలో ఫోర్టి ఫైడ్ ( బలవర్థక ) బియ్యం రాష్ట్ర ప్రభుత్వం 7 జిల్లాలలో అమలు చేస్తున్నదని త్వరలో అన్ని జిల్లాలకు విస్తరించనున్నదని అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న అంగన్వాడీలకు, పాఠశాలలకు ఫోర్టి ఫైడ్ రైస్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇందులో ప్రతి 50 కే.జీ లకు 500 గ్రామలు ఫోర్టి ఫైడ్ రైస్ కలిపి ఇస్తున్నారని అవగాహన లేకుండా బియ్యం నానబెట్టినప్పుడు తేలుతున్నాయని, రబ్బర్ రైస్ అని ఆపోహలతో వాటిని తీసివేసి ఆహరం తయారుచేసి అంగన్వాడీలలో సంపూర్ణ పోషణ , పాఠశాలల్లో మద్యాహ్న భోజనంగా అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోర్టి ఫైడ్ రైస్ ను అంగన్వాడీలకు పాఠశాలలకు అందించడం వలన ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి 12 విటమిన్ అందుతాయని దీనివల్ల ఆరోగ్యంతో పాటు వెన్నెముక కు బలం, మెదడు బాగా పనిచేయడం వంటి వాటికి ఉపయోగ పడుతుందని తెలిపారు. దీనితో పాటు కమీషన్ పరిదిలోకి ప్రధాన మంత్రి మాత్రు వందన యోజన కార్యక్రమం కూడా వస్తుందని మొదటి సారి గర్భవతులకు కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడు సార్లు 5 వేలు, రాష్ట్ర ప్రభుత్వం బిడ్డ పుట్టిన తర్వాత మరో రెండు వేలు అందిస్తున్నదని ఆరోగ్యవంతమైన తల్లి బిడ్డ కోసం అమలు చేసే ఈ పథకం పటిష్టంగా అమలు కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నాడు నేడు కార్యక్రమం క్రింద కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాఠశాల ల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుచున్నదన్నారు. ఎక్కడైనా పాఠశాల ల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా మెనూ అమలు చేయడం లేదని కమీషన్ దృష్టికి వచ్చిన సుమోటోగా ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫుడ్ కమిషన్ చైర్మన్ వెంట డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర రావు, పౌర సరఫరాలు డిఎం శ్రీమతి పద్మ, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ రమేష్ బాబు, ఐసీడీఎస్ పిడి ఉమామహేశ్వరి, సీడీపీఓ శ్రీమతి విజయలక్షి, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీ ఈశ్వరరావు, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి శ్రీ వెంకటయ్య, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ వెంకటేశ్వర రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పరిమళ, తహశీల్దార్ శ్రీ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment