బాలల న్యాయ చట్టం మోడల్ రూల్స్ 2022 పై అవగాహణ కలిగి ఉండాలి... . ... కేసలి అప్పారావు.


     

బాలల న్యాయ చట్టం  మోడల్ రూల్స్ 2022 పై అవగాహణ కలిగి ఉండాలి...

.       ... కేసలి అప్పారావు.

                



విజయవాడ.... స్వర్ణ పేలస్ (ప్రజా అమరావతి);

  ఉదయం 10 నుండి 5.30 

                

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించ బడిన బాలల న్యాయ చట్టం మోడల్ రూల్స్ 2022 మీద  విజయవాడ కి చెందిన ఆంధ్ర ప్రదేశ్ చైల్డ్ రైట్స్ అడ్వికసి పోండేషన్ వారి ఆధ్వర్యం లో రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కు, బాలలతో పని చేసే వివిధ సంఘాల ప్రతినిదులతో అవగాహాణ కార్యక్రమం ను నిర్వహించిరి.

ఈ కార్యక్రమంకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు ముఖ్య అతిథిగా విచ్చేసి సయ్యిద్ రిషా రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించింది.

ఈ కార్యక్రమం ను ఉద్దేశించి అప్పారావు మాట్లాడుతూ బాలలుతో బాలలు కోసము పనిచేసే ప్రతీ ఒక్కరూ ఈ బాలల న్యాయ చట్టాలు పై పూర్తి స్థాయిలో   అవగాహణ పొంది ఉండాలని, విద్యార్దులుకు కూడా ఈ చట్టాలు గురుంచి తెలియ జేయాలని చెప్పారు.

నూతన రూల్స్ లో పొందు పరచబడిన విషయాలు అనగా జిల్లా స్తాయి బాలల సంక్షేమ సమితి, జిల్లా కలెక్టర్ మరియు బాలల సంరక్షణ విభాగం వారికి సంబందించిన భాద్యతలు, విధులు తెలియజేయడం జరిగింది.


ఫ్రాన్సిస్ తంబి మాట్లాడుతూ ముఖ్యంగా  బాలల చట్టబద్ధ దత్తత, పోషణ, సంరక్షణ , శిశు సంరక్షణ కేంద్రాలు నిర్వహణ,బాలల గ్రీవెన్స్ మొదలగు అనేక అంశాల గురుంచి వివరించి చర్చించడం జరిగింది.

 ప్రతీ జిల్లా లో వీటిపైన విస్తృతంగా ప్రచారం చేసి, గ్రామ/ వార్డ్ స్థాయి లో గల సచివాలయం సిబ్బందికి,గ్రామ స్థాయి బాలల రక్షణ కమిటీలుకు , ప్రజా ప్రతినిధిలకు,అధికారులకు వివరించి తెలియజేయాలని సూచించారు.

రీసోర్స్ పర్సన్ సయీద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం నూతనంగా పొందుపరచ బడిన అంశాలను  వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఫ్రాన్సిస్ తంబి, బచపన్ బచావో ఆందోళన్ ప్రతినిధులు తిరుపతి రావు,చంద్ర శేఖర్,  రోషన్ కుమార్,ఆర్టీఈ కన్వీనర్, సి ఏ సీ ఎల్ కమిటీ వారు, కృష్ణ కుమార్, కొమ్ము రమణ మూర్తి, కవితా రెడ్డి, శ్రీనివాసరావు, పెంకి చిట్టియ్య తదితరులు పాల్గొన్నారు.

Comments