27న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు
విజయనగరం, సెప్టెంబర్ 25 (ప్రజా అమరావతి): జిల్లాలో ఉత్సాహవంతులైన యువతను చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించడం ద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో సెప్టెంబర్ 27న ఉదయం 10-30 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు నిర్వహిస్తున్నట్లు పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పాపారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ సూర్యకుమారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ సదస్సులో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు వివరించి వారిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన ఉత్సాహ వంతులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని సదస్సుకు హాజరు కావాలని కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, డి.ఆర్.డి.ఏ. లు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
addComments
Post a Comment