వినాయకుడి గుడి వద్ద నుండి క్యూలైన్లోని భక్తులకు 30 నిమిషాల్లోనే అమ్మవారి దర్శనం...

 ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);





భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా  అమ్మవారి దర్శనం...


వినాయకుడి గుడి వద్ద నుండి క్యూలైన్లోని భక్తులకు 30 నిమిషాల్లోనే అమ్మవారి దర్శనం...



నేటి నుండి ఫుట్ స్కానర్ ద్వారా భక్తుల సంఖ్య నమోదు....

డిప్యూటీ సీఎం, దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ.


శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై రెండవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని మంత్రి అన్నారు. బాలారిష్టంగా దసరా నవరాత్రుల్లో మొదటి రోజు భక్తులకు ఎదురైన ఇబ్బందులను, పరిస్థితులను ముఖ్యంగా నెట్ వర్క్, క్యూ లైన్ లు, వగైరా లను సరిదిద్ది నేటి నుండి సక్రమంగా జరిగేలా అధికారులను ఆదేశించామన్నారు. ఫుట్ స్కానర్ ద్వారా భక్తుల సంఖ్యను నమోదు చేస్తామన్నారు.మొదటిరోజు  జరిగిన లోటు పాట్లను సవరించి పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఇంద్రకీలాద్రి పై భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ, రెవెన్యూ,ముఖ్యంగా జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ, పోలీస్ శాఖలు సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి మరింత తొరితవంతంగా అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లను పరిశీలించి అధికారులను ఆదేశిస్తున్నారన్నారు. పులిహోర, దద్దోజనం, పొంగలి ప్రసాదంగా భక్తులకు  ఉచితంగా పంపిణీ చేయటంతో విడిగా పులిహోర ప్రసాదం విక్రయం జరిగి ఉండకపోవచ్చు అని అన్నారు. నిన్నటి రోజున 60 వేల లడ్డూలు విక్రయం జరిగిందన్నారు. క్యూ లైన్ లు, ప్రసాద విక్రయాలపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకోగా ఏర్పాట్లు బాగున్నాయంటూ సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. ఇంద్రకీలాద్రిపై మీడియాకు తగిన సమాచారంపై దేవాదాయ శాఖ నుండి పిఆర్వోను సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకుంటానని మంత్రి అన్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా నిర్ణీత సమయంలో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 12గంటలవరకు, మధ్యాహ్నం నాలుగు గంటల నుండి సాయంత్రం 6:00 వరకు వరకు, అమ్మవారి దర్శనానికై మోడల్ అతిధి గృహంలో ప్రత్యేక బస్ ఏర్పాటు చేశామన్నారు. క్యూ లైన్ లలో భక్తులకు అమ్మవారి దర్శనం మరింత త్వరితంగా జరిగేలా మరిన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అన్నారు. భక్తుల ఇబ్బందులు, ఏర్పాట్ల లోటుపాట్లపై తగు సూచనలు చేసిన ఎడల సరిదిద్ది అమలు చేస్తామని చెప్పారు. భక్తులకు సౌకర్యార్థం వారి సమయం వృధా కాకుండా  తక్కువ సమయంలో దర్శనం కొరకు 500 రూపాయల టిక్కెట్ లు ప్రవేశపెట్టామని ఇది ఆన్ లైన్ లో లభిస్తాయాని మంత్రి తెలిపారు.



మంత్రితో పాటు ఆలయ ఈ ఓ డి. భ్రమరాంబ, స్పెషల్ ఆఫీసర్ రామచంద్ర మోహన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments