తల్లుల ఖాతాల్లో రూ. 61.73 కోట్లు యూనిఫాం కుట్టు కూలీలు జమ.

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ - సమగ్ర శిక్షా (ప్రజా అమరావతి);



తల్లుల ఖాతాల్లో రూ. 61.73 కోట్లు యూనిఫాం కుట్టు కూలీలు జమ.

సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు.

 ‘జగనన్న విద్యాకానుక’లో భాగంగా 2021-22 విద్యా సంవత్సరానికిగానూ విద్యార్థులకు ఇచ్చిన 3 జతల యూనిఫాం క్లాత్ కుట్టు కూలీ కోసం 43,06,032 మంది తల్లుల ఖాతాల్లో   రూ. 61,72,82,160/-లు శుక్రవారం జమ చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 3 జతల కుట్టు కూలీకి గానూ రూ. 120, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు రూ. 240 చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్, జత బూట్లు- రెండు జతల సాక్సులు, బెల్టు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, పిక్టోరియల్, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీతో పాటు బ్యాగు కిట్ గా అందించామని తెలిపారు.





Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image