. ఈ క్రాప్ బుకింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


జిల్లాలో 18 చోట్ల ప్రాధాన్యత భవనాలకు స్థలాలు గుర్తింపు ప్రక్రియను ఆదివారం సాయంత్రం కు పూర్తి చేసి అప్పగించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. ఈ క్రాప్ బుకింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు


తప్పవని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.శనివారం సాయంత్రం ఈ క్రాప్ ఆధార్ నమోదు, ప్రాధాన్యత భవనాలు పెండింగ్ స్థలాలు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలో 2 లక్షల 04 వేల ఎకరాల్లో ఈ క్రాప్ బుకింగ్ చేపట్ట వలసి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 1,33,000 ఎకరాల్లో నమోదు ప్రక్రియ పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. ఆగస్ట్ 31 వరకు ఈ క్రాప్ నమోదు కి ఉన్న టైం లైన్ ను సెప్టెంబర్ 9 వరకు పెంచడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయినప్పటికీ ఇంకా నిర్లక్ష్యం గా ఉంటే సంబందించిన మండల వ్యవసాయ అధికారి, ఏం పీ డి ఓ లదే వ్యక్తిగత బాధ్యత అన్నారు. మిగిలిన 71,248 ఎకరాలను రాబోయే 5 రోజులు రోజుకి 17 వేలు లక్ష్యాలను సాధించడానికి  అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రాప్ బుకింగ్ ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం కలుగుతుందని, ప్రభుత్వ పరంగా చేయూత నివ్వడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి అయిన క్షేత్ర స్థాయి సిబ్బందిని పెండింగ్ లో ఉన్న గ్రామాలకు, మండలాలకు పంపాలని, అందుకు అనుగుణంగా డిప్యూటేషన్ ఆర్డర్ లు సాయంత్రం లోగా అందచేయాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం చేసిన ఏ వో, హెచ్ వో లకు, సంబందించిన మండల అధికారులకు షో కాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
 జిల్లాలో 1101 సచివాలయ, అర్భికే, హెల్త్ సెంటర్ ల కోసం 1,083 చోట్ల స్థలాలు గుర్తించడం జరిగిందని, ఇంకా 18 చోట్ల ప్రాధాన్యత భవనాలు కోసం స్థలం గుర్తింపు జరగాలని  ఆదేశించారు. మన పొరుగున వున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రాధాన్యత భవనాలకు వంద శాతం స్థలాలు గుర్తించడం సాధ్యం అయితే ఇక్కడ ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నించారు. ఇప్పటికే 18 భవనాలకు సంబంధించి కొన్ని మండలాలు స్థలాలు గుర్తించడం జరిగిందన్నారు.   మిగిలిన వారు ప్రభుత్వ స్థలం లేదా భూసేకరణ లేదా దాతలు ద్వారా ప్రాధాన్యత భవనాలు కోసం తహశీల్దార్లు ఛాలెంజ్ తీసుకుని పని చెయ్యాలని స్పష్టం చేశారు.


Comments