రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
జిల్లా లో గల ప్రతీ పంచాయతీ లలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ లను క్రీడాంశముల వారీగా ఏర్పాటు చేయవలసి యున్నద
ని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు.
శుక్రవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వారు రూపొందించిన జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ఆవిష్కరించి, గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , జగనన్న స్పోర్ట్స్ క్లబ్ ల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశ్యము క్రీడా కార్య కలాపాల అభివృద్ధికి మరియు గ్రామీణ ప్రతిభావంతులైన ఆటగాళ్లను ప్రోత్సహించడం అన్నారు. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ లో 18 సం.లు వయసు పైబడిన వారు ఎవరు అయిననూ ఏర్పాటు చేసుకొన వచ్చునని పేర్కొన్నారు. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ లో ముఖ్యముగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ, ట్రెజరర్, మిగిలిన వారు సభ్యులుగా ఉండా లని శేషగిరి రావు అన్నారు.
ఈ కార్యక్రమములో శ్రీ డి.ఎం.ఎం.శేషగిరి, ముఖ్య క్రీడా శిక్షకులు, మరియు బి.వి.జి.నాగేంద్రన్ యోగా కోచ్, ఎన్.మోహనదాస్ బాస్కెట్ బాల్ కోచ్ పాల్గొన్నారు.
addComments
Post a Comment