విజయవాడ (ప్రజా అమరావతి);
ఆదివాసీల హక్కుల రక్షణే ఎస్టీ కమిషన్ లక్ష్యం
- కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది.
- గిరిజన ఉద్యోగులందరితో సమావేశాలు నిర్వహిస్తాం..
- గిరిజనులు, గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు.
గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు తెలిపారు. అడవులలో జీవనం కొనసాగించడం ఆదివాసీల హక్కు అని, అడవుల నుండి ఆదివాసీలను దూరం చేయడం దేశంలో ఎవరితరం కాదన్నారు. గిరిజన ఉద్యోగులకు రాజ్యాంగపరమైన హక్కులు, ప్రభుత్వ ప్రయోజనాలు, గిరిజన ఉద్యోగుల హక్కుల సంరక్షణ వంటి తదితర అంశాలపై విజయవాడ మెట్రోపాలిటిన్ హోటల్ నందు మంగళవారం ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు ఆధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పశు సంవర్థక శాఖలో పనిచేయుచున్న గిరిజన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తుల పరిచయ, అవగాహన సమావేశం జరిగింది. గిరిజనులకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించడం, వాటిని కాపాడటం కోసం ప్రభుత్వాలు చేసే చట్టాలను సక్రమంగా అమలు చేసే విధంగా అవరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రవిబాబు తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ కుంభా రవిబాబు మాట్లాడుతూ... గిరిజన హక్కులు, వాటి సంరక్షణ కోసం కమిషన్ పాటుపడుతుందని తెలిపారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 11 జిల్లాల్లో కమిషన్ పర్యటించిదని, ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి కృషిచేయడం జరుగుతోందని చెప్పారు. ఇటీవల జరిగిన విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో సుమారు 650కి పైగా బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని కమిషన్ గుర్తించదని తెలిపారు. సత్వరమే బ్యాక్ లాగ్ పోస్టుల నియామకానికి తగుచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆదివాసి రైతులకు ప్రభుత్వం అటవీ భూములపై పట్టాలు ఇవ్వడం ద్వారా గత మూడు సంవత్సరాలలో నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగిందని తెలిపారు. వివిధ శాఖలలో పనిచేయుచున్న 42 వేల మంది గిరిజన ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన నియామకాలు, పదోన్నతులు వంటి విషయాలలో వివక్ష జరిగితే రాజ్యాంగపరమైన హక్కుల రక్షించడంలో కమిషన్ సహకరిస్తుందని సంబంధిత అధికారులఫై కమిషన్ తన విస్తృత అధికారాలను ఉపయోగించడంలో వెనుకంజ వేయదని ఆయన తెలిపారు. గిరిజనుల అభ్యున్నతికి విద్య, వైద్యం, ఆరోగ్యం ఉద్యోగ అవకాశాలు మాత్రమే దోహద పడతాయని గిరిజన ఉద్యోగులు అందరూ నిరుద్యోగ యువతను ప్రోత్సహించి గిరిజన/ఆదివాసి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా కమిషన్ అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో, శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. నియామకాలు, పదోన్నతులలో ఉన్న సమస్యల పరిష్కారానికి కమిషన్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఏర్పడిన ఎస్టీ కమిషన్ కు చైర్మన్ గా నియమించి, గిరిజన/ఆదివాసి యువతకు, ఉద్యోగులకు, ఆదివాసి ప్రజానీకానికి రాజ్యాంగపరమైన హక్కుల రక్షణ కొరకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి కుంభ రవిబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ, ప్రత్యేక మెడికల్ కాలేజీ, ఆదివాసీలకు కనీస మద్దతు ధర వంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గిరిజన అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని కుంభ రవిబాబు తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్, జె. లిల్లి, కొర్ర రాము, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డా. అమరేంద్ర, ఎస్టీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. సతీష్, డిజిటల్ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు డాక్టర్ డి వెంకటేశ్వర్లు, కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎల్ గణేశ్వరరావు, పశుసంవర్ధకశాఖ ఎస్సీ/ ఎస్టీ గెజిటెడ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు బి .రాజశేఖర్, కార్యదర్శి ఓ. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment