శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
దసరా మహోత్సవములు -2022 సందర్భంగా ఈరోజు అనగా ది.03-09-2022 న శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారి సమక్షంలో ఆలయ స్థానాచార్యుల వారు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వినాయక స్వామి వారి దేవస్థానం వద్ద క్యూ లైన్ పనులు ప్రారంభించడం జరిగినది.
ఈ కార్యక్రమము నందు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీ కె.వి.ఎస్ కోటేశ్వరరావు గారు, శ్రీమతి లింగం రమాదేవి గారు, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ బొప్పన అశోక్ గారు, అర్చకులు ఉండి శ్రీను గారు మరియు ఇంజినీరిoగ్ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment