శిక్షణా, సామర్థ్యం పెంపు కోసం ఎకో ఇండియాతో ఎపి శాక్స్ ఒప్పందం*శిక్షణా, సామర్థ్యం పెంపు  కోసం

ఎకో ఇండియాతో ఎపి శాక్స్ ఒప్పందం


*


అమరావతి (ప్రజా అమరావతి): రాష్ట్రంలో సామర్ధ్యం పెంపుదల, శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (ఎపి శాక్స్) ఢిల్లీ కి చెందిన ఎకో ఇండియాతో  ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఈమేరకు గురువారం తాడేపల్లి లోని ఎపి శాక్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ మరియు ఎపి శాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జిఎస్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఎపి శాక్స్ ఎపిడి డాక్టర్ కామేశ్వరప్రసాద్, ఎకో ఇండియా సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ సందీప్ భల్లా ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాల్ని పరస్పరం అందజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ సి డి నోడల్ అధికారి డాక్టర్ టివిఎస్ఎన్ శాస్త్రి, క్యాన్సర్ కేర్  నోడల్ ఆఫీసర్ డాక్టర్ నరసింగరావు,  డిఎంఇ కార్యాలయ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుగుణన్, పెప్ఫార్ సమన్వయకర్త డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎకో ఇండియాసంస్థ జనరల్ మేనేజర్ ఇ ఆర్ శ్రీబాబు తదితరులు పాల్గొన్నారు. 


Comments