హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చుకోవాలి*హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చుకోవాలి*


పార్వతీపురం, సెప్టెంబర్ 10 (ప్రజా అమరావతి): 2013 సంవత్సరం తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు విధిగా "హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చాలని జిల్లా రవాణాశాఖ అధికారి ఎం.శశి కుమార్ తెలిపారు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆజ్ఞానుసారం, రాష్ట్ర రవాణా శాఖ కమీషనరు ఉత్తర్వులు జారీ చేశారని శని వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ సాంకేతికపరంగా తగు ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు. వాహన యజమానులు, వాహన డీలర్లు, ఫైనాన్సియర్లు తదితరులు వాహనం నంబరు ప్లేటు పొందుటకు "ఇ-ప్రగతి" వెబ్ పోర్టల్ లో  (https://aprtacitizen.epragathi.org/#!/Hsrpbookingslot) వాహన రిజిస్ట్రేషను సంఖ్యను నమోదు చేసి స్లాట్ ను పొందాలని సూచించారు. నంబరు ప్లేట్ అమర్చుటకు అనుకూలమైన తేదీని, నంబరు ప్లేటును రవాణాశాఖ కార్యాలయం లేదా ఇంటివద్ద అమర్చే వివరాలు కూడా పొందు పరచాలని ఆయన స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా రుసుము చెల్లించాలని చెప్పారు. ఎంపిక చేసుకున్న తేదీ నాటికి హై సెక్యూరిటీ నంబరు ప్లేటు బిగింపుకు సిద్దంగా ఉందని చరవాణికి సందేశము పంపడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ఎంపిక చేసుకున్న ప్రకారం నంబరు ప్లేటును బిగించాలని ఆయన చెప్పారు.వాహనదారులు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని వాహనాలకు "హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు" అమర్చుకోవాలని కోరారు.  తనిఖీలలో హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు" లేనట్లు గుర్తించిన వాహనాలకు అపరాధ

రుసుము విధించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Comments