బాలలు, మహిళల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


బాలలు, మహిళల హక్కుల పరిరక్షణకు  ప్రతి ఒక్కరు కృషి చెయ్యాల



ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, చైల్డ్ రైట్స్ కమీషన్ సభ్యులు త్రిపర్ణ ఆదిలక్ష్మి లు అన్నారు.


 మంగళవారం స్థానిక ఆనంద్ రోటరీ హాల్లో బాలలు, మహిళల సంరక్షణ, భద్రత అంశాలపై రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమీషన్, మహిళా కమీషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. 


ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ   మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న  లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి  వారి కొరకు  అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. గర్భిణీ, బాలింతలు, పిల్లలు ఆరోగ్య సంరక్షణ, భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిదన్నారు.  అంగన్వాడి కేంద్రాలు ద్వారా పౌష్టికాహారాన్ని ఇంటికే అందిస్తున్నారన్నారు. అంగన్వాడి  కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశ పెట్టారన్నారు.  చిన్నతనంలో నేర్చున్న ప్రతి అంశం భవిష్యత్తు అభివృద్ధికి  పునాది వంటిదన్నారు.  మహిళలు, బాలల రక్షణ కొరకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్, చైల్డ్ లైన్ ను సద్వినియోగం చేసుకోవాలని, వీటిపై ప్రజల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా వారికి ఎటువంటి కష్టం వచ్చినా క్షణాల్లో సమాచారం అందించే దిశగా  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని  ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత నిస్తుందని అందులో భాగంగా పాఠశాలలు ఆధునీకరణ, ఫ్యామిలీ డాక్టర్ విధాన్ని అమలు చేస్తున్నా రన్నారు.

మహిళలు రాజకీయ, సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో   50 శాతం రిజర్వేషన్ కల్పించిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహనరెడ్డి అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం చెందేందుకు అనేక సంక్షేమ పథకాలు మహిళలు పేరునే అమలు చేయడం 


అక్టోబర్ 1 వ తేదీన రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో నిర్వహించే "దసరా మహిళా సాధికారిత "ఉత్సవానికి  మహిళలలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి  సుబ్రహ్మణ్యం మైదానం  వరకు మహిళా బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. తదుపరి కరాట, కొళాటం, కబాడీ, కత్తిసాము వంటి ఆటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్, షార్ట్ ఫిల్మ్ ల ప్రదర్శన, విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమానికి  రాష్ట్ర మహిళా మంత్రులు తానేటి వనిత , ఆర్కే. రోజా, మహిళా పార్లమెంటు సభ్యులు పాల్గొంటారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలిపారు.


బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు టి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యం తో ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కు రాజ్యాంగం కల్పించిన హక్కులు  అమలు కోసం కృషి చేయ్యాలన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం దేశంలో బాలల హక్కుల రక్షణ కోసం అందించబడిన రక్షణ పరిస్థితులను అంచనా వేయండం, వాటిపై  సమీక్షించండం చేస్తున్నామని, అందులో భాగంగా క్షేత్ర స్థాయి లో అవగాహనకార్యక్రమాలను నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు.  వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలను కూడా సూచించండం కోసం ఈవేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పబ్లిక్ డొమైన్‌లోని చట్టాల పనితీరుపై నివేదికలను అవసరమైన సందర్భం లో  ప్రభుత్వానికి అందజేయండానికి చైల్డ్ రైట్స్ కమిషన్ కీలక పాత్ర పోషించడం జరుగుతుందని అన్నారు. పిల్లలు రక్షణ వారి హక్కులను కాసపాడే దిశగా ప్రతి ఒక్కరు భాద్యతగా వుండాలన్నారు. అంగన్వాడి  కేంద్రాల  ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, మంచి విద్యను, ఆటపాటలను అందించడం  ద్వారా వారిలో మానసికంగా ఎదుగుతారన్నారు. చైల్డ్ రైట్స్ కమిషన్  రాష్ట్రమంతా  పర్యటిస్తూ బాలల  హక్కులు, పరిరక్షనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళలు అన్నిరంగాల్లో వారికి బాసట నిలిచే దిశ గా వారి పేరునే సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం  అమలు చేస్తుందన్నారు. విద్యాదీవెన, అమ్మఒడి, వసతి దీవెన వంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన అమలు చేస్తున్నారని తెలిపారు.

 

జిల్లా అదనపు ఎస్.పి. ఎం. రజని మాట్లాడుతూ సమాజంలో స్త్రీ లను, పిల్లలను గౌరవించేలా తల్లి తండ్రులు వారి పిల్లలకు చిన్న నాటి నుంచేనేర్పించాలన్నారు. ఆడపిల్లలకు విద్యను నేర్పించిదంతో పాటు  దైర్యం చెప్పాలన్నారు. ఇప్పటికీ అక్కడక్కడా వరకట్నం వేధింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు. 


మహిళా శిశు సంక్షేమ శాఖ పీ డి కె. విజయలక్ష్మి  మాట్లాడుతూ జిల్లాలో మాతా శిశుమరణాలు తగ్గించేందుకు తల్లి బిడ్డల సంరక్షణ, గర్భిణీ స్త్రీ ల ఆరోగ్య భద్రతను అంగన్ వాడి కేంద్రాలలో ద్వారా పర్యవేక్షిస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నా మన్నారు. ప్రతి గర్భిణీ లో  విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం సంవృద్ధి గా ఉండేందుకు  సూక్ష్మ పోషణ ఆహారంగా వై ఎస్ ఆర్ కిట్స్ ద్వారా అందిస్తున్నామన్నారు.


ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసం, దసరా మహిళా సాధికారత ఉత్సవాల పోస్టర్  ను ప్రారంభించారు.



 కార్యక్రమంలో  చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర కుమార్,  గొంది సీతారాం,మహిళా కమిషన్ సభ్యులు జయశ్రీ, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ సూర్య ప్రభావతి  పలువురు సి డి పి ఓ లు  వర్కర్లు , డ్వాక్రా మహిళలు తదితరులు  పాల్గొన్నారు.




Comments