ఇంద్రకేలాద్రి: సెప్టెంబర్ 26 (ప్రజా అమరావతి);
సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేని విధంగా ప్రముఖుల సమాచారం ముందుగానే తెలియజేయాల
ని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు కోరారు
సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దసరా ఏర్పాట్లపై క్యూలైన్లోని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు తొలిరోజు అరగంటలోపుగా దర్శనం పూర్తవుతుందన్నారు. సామాన్య భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలగకుండా వీవీఐపీల సమాచారం ముందుగా తెలియజేస్తే ప్రోటోకాల్ కు ఇబ్బంది ఉండదు అని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఓంకారం సెంటర్ మార్గం నుండి వివిఐపీలను పైకి తీసుకురావడం జరుగుతుందని, అదే మార్గం నుండి వికలాంగులకు కూడా తీసుకు రావడం జరుగుతుందన్నారు . అక్టోబర్ 2 నుంచి 5వ తేదీల వరకు భక్తులు సంఖ్య పెరుగుతుందని, సుమారు రెండు నుండి రెండున్నర లక్షల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తేనే శరన్నవరాత్రులను విజయవంతం చేయగలమన్నారు. భక్తుల రద్దీని ఎలా నియంత్రించవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం ఎలా చేయించవచ్చు అనే విషయాలపై మీడియా, పోలీస్, పబ్లిక్ అందరూ సలహాలు ఇవ్వాలని కోరారు. చిన్న, చిన్న సంఘటనలు, విమర్శలు లేనివిధంగా దసరా ఉత్సవాలు పూర్తి చేయడానికి ప్రీతీ ఒక్కరూ సహాయసహకారాలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
addComments
Post a Comment