విజయవాడ (ప్రజా అమరావతి);
దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున భక్తులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మల్లింపుకు ఏర్పాట్లు
చేసినట్లు గుంటూరు రేంజ్ డి.ఐ.జి. త్రివిక్రమ వర్మ తెలిపారు.
మంగళవారం బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉన్న అమ్మవారిని గుంటూరు రేంజ్ డి.ఐ.జి. త్రివిక్రమ వర్మ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద ఇరువురు అధికారులు సంయుక్తంగా మాట్లాడుతూ అక్టోబర్ 2 ఆదివారం మూలా నక్షత్రం రోజున 2 లక్షలకు పైబడి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని అంచనా ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా పలు ట్రాఫిక్ ఆంక్షలతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వాహనాలను హనుమాన్ జంక్షన్, పామర్రు, బాపట్ల, చీరాల మీదుగా పంపడం జరుగుతుందని, అలాగే హైదరాబాద్ వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం మీదుగా డైవర్ట్ చేయడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ డైవర్సిన్ అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం నుండి ఉంటుందన్నారు. 2వ తేదీ మధ్యాహ్నం కు భక్తుల రద్దీ తగ్గినట్లయితే ట్రాఫిక్ ఆంక్షలను సడలించడం జరుగుతుందన్నారు. అలాగే నగరంలో కూడా పలు ట్రాఫిక్ డైవర్షన్ కు చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు.
addComments
Post a Comment