*మండలి చైర్మన్ కు విశ్వబ్రాహ్మణుల వినతి
* భీమవరం, సెప్టెంబర్ 24 (ప్రజా అమరావతి); ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణుల సంఘం నాయకులు శనివారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజును భీమవరంలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు.తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు (కమ్మరి, కంచరి, వడ్రంగి, శిలాశిల్పులు, స్వర్ణకారులు ) జనాభా ఉందని ఆ సంఘం రాష్ట్ర నాయకులు వివరించారు. రాష్ట్ర బీసీ జనాభాలో ఏడోవ అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా నిరాధరణకు గురి కాబడిన వర్గంగా అందరు భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఎంతో ఉత్సాహన్ని ఇచ్చారని సంఘ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలను (సి ఎం పి, నెంబర్ 3615/ఎస్ పి ఎల్ సెక్రెటరీ /తేది 21.5.2020)అమలుకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.మంగళ సూత్రాలు తయారు హక్కు దారులుగా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు వీలు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేయాలని, జీవో ఎం ఎస్ నెంబర్ 272, తేది 23.5.2009 రద్దు పరచుట లేదా సవరణలు (స్వర్ణకారులకు అనుకూలంగా )చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలి చైర్మన్ మోషేనురాజు స్పందిస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి విషయం తీసుకు వెళ్ళి పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత సంఘ నాయకులు మండలి చైర్మన్ ను సత్కరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు జావ్వాది కూర్మాచార్యులు, అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి, కోశాధికారి సింహాద్రి ధనుంజయాచారి తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment