*దేవాలయ అభివృద్ధికి సింహభాగం నిధులు కేటాయిస్తా..*
*: ఢిల్లీకి లేపాక్షి బృందాన్ని తీసికెళతా..*
*: యునెస్కో గుర్తింపుపై పార్లమెంట్లో ప్రస్తావిస్తా.. - ఎంపి గోరంట్ల మాధవ్*
*పర్యాటక అభివృద్ధి చెందాలంటే ఇతర దేశాలు, రాష్ట్రాలు నుంచి విచ్చేసే భక్తులు, పర్యాటకులను అతిధుల్లా భావించాలి : జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
లేపాక్షి (శ్రీ సత్యసాయి జిల్లా), సెప్టెంబర్ 27 (ప్రజా అమరావతి):
దక్షిణ భారత దేశంలోనే అత్యంత చిత్రకళా నైపుణ్యం అద్భుతాలకు, సాంస్క్రతి సాంప్రయాదాయలకు రాతిపై రత్నంలాంటి రూపాన్ని దిద్దిన శిల్పుల గొప్పతనాన్ని చూపించాలని, పార్లమెంట్ నిధుల్లో లేపాక్షి దేవాలయం సింహభాగాన్ని అభివృద్ధికి అందజేస్తామని హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం కొడికొండ చెకోపోస్టు నుండి లేపాక్షి నంది విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏపి టూరిజంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తో పాటు పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ రామచంద్ర, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి, మేనేజర్లు దీపక్, లక్ష్మణరావు, ఎంపిడిఓ నరసింహనాయుడు, తహసిల్దార్ బాబు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధి చెందాలంటే ఇతర దేశాలు, రాష్ట్రాలు నుంచి విచ్చేసే భక్తులు, పర్యాటకులను అతిధుల్లా భావించాలన్నారు. దేవాలయంలో ప్రస్తుతం ఏవైనా ఇబ్బందులు వుంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, వివిధ రాష్ట్రాల్లోని దేవాలయాల కంటే కూడా లేపాక్షికి ప్రత్యేక చరిత్ర వుందన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలోనే కాకుండా ప్రపంచ చిత్ర పటంలో ప్రత్యేక స్థానం ఈ దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం పార్లమెంట్లో ప్రస్తావించి అక్కడ పెద్దలతో ఒప్పించి అభివృద్ధికి ఎంపి నిధులే కాకుండా కేంద్రం ద్వారా పర్యాటక శాఖ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా కృషి చేస్తామన్నారు. మరి కొద్ది రోజుల్లో లేపాక్షి దేవాలయం అభివృద్ధికి సంబంధించిన సమగ్ర నివేదికను స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాలయ కర్తలను పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ఢిల్లీకి తీసుకెళాతమని హామి ఇచ్చారు.
ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ పర్యాటక శాఖ అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కలిసి అభివృద్ధిపై చర్చిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి లేపాక్షి అభివృద్ధిపై ప్రస్తావించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో సర్పంచ్ ఆదినారాయణ, జెడ్పిటిసి బాణాల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ లు నీలావతి, అంజన్ రెడ్డి, కన్వీనర్ నారాయణస్వామి, పులమతి సర్పంచ్ అశ్వత్థ నారాయణ, అధికారులు, ప్రజా ప్రతినిధులు టూరిజం శాఖ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment