ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని సజావుగా నిర్వహించేలా సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి


నెల్లూరు (ప్రజా అమరావతి);


 

నెల్లూరు ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో  ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరగనున్న  ఆర్మీ రిక్రూట్మెంట్  ర్యాలీని సజావుగా నిర్వహించేలా సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల


ని నెల్లూరు నగర పాలక  సంస్థ కమీషనర్ శ్రీమతి హరిత, అధికారులను ఆదేశించారు. 


నెల్లూరు ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో  ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు  ఆర్మీ రిక్రూట్మెంట్  ర్యాలీ జరగనున్న నేపధ్యంలో, అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై నెల్లూరు నగర పాలక కమీషనర్ శ్రీమతి హరిత, ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కర్నల్ ఎస్. కోహ్లి తో కలసి శనివారం ఉదయం  ఏ.సి.స్టేడియంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి  అధికారులకు పలు సూచనలు, అదేశాలిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర పాలక కమీషనర్ శ్రీమతి హరిత  మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు ఆర్మీ రిక్రూట్మెంట్  ర్యాలీ నెల్లూరు ఏ సి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతుందని, ఈ ర్యాలీకి సుమారు 38 వేల మంది అభ్యర్ధులు  ఆన్ లైన్ లో తమ పేర్లను  నమోదు చేసుకోవడం జరిగిందని,  రోజుకు 3 వేల మంది  వంతున  ఈ ఆర్మీ రిక్రూట్మెంట్  ర్యాలీకు హాజరౌతారని తెలిపారు. అందుకనుగుణంగా  ఆర్మీ రిక్రూట్మెంట్  ప్రక్రియ సజావుగా జరిగేలా  వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందని,  సంబందిత శాఖల అధికారులు  ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులతో సమన్వయం చేసుకొని ఎవరికి కేటాయించిన విధులను వారు  బాధ్యతతో నిర్వర్తించి   ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికా బద్దంగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారుల సూచనల మేరకు  బ్యారీకేడింగ్, లైటింగ్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్, పోలీసు బంధోబస్తు, శానిటేషన్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు తదితర విధులను సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా చేపట్టాలని కమీషనర్, అధికారులకు సూచించారు.


తొలుత ఆర్మీ రిక్రూట్మెంట్  ప్రక్రియకు సంబంధించి  స్టేడియంలో  శాఖల వారీగా చేపట్టాల్సిన  విధులను ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కర్నల్ ఎస్. కోహ్లి వివరించారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్.పి శ్రీ శ్రీనివాస రావు, ఆర్.డి.ఓ శ్రీ మాలోల, సెట్నల్ సి.ఈ.ఓ శ్రీ పూల్లయ్య, ఎన్.ఐ.సి అధికారి శ్రీ సురేశ్ కుమార్, ఆర్.అండ్ బి., విద్యుత్, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా, మునిసిపల్,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  


  


Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image