కట్టని, కట్టలేని రాజధానికోసం కృత్రిమ ఉద్యమం..


అమరావతి (ప్రజా అమరావతి);


*తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు.* 


*వికేంద్రీకరణపై శాసనసభలో చర్చ.*


*ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...* 


*58 ఏళ్ల రాష్ట్రం– రాజధాని కోసం ఉద్యమాలు లేవు*

ఈ రోజు వికేంద్రీకరణ దాని ప్రభావం మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. 1956 నుంచి 2014 వరకు ఈ 58 సంవత్సరాలు కలిసి ఉన్న రాష్ట్రం...విడిపోతున్నప్పుడు కానీ.. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల పాటు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు కానీ, చంద్రబాబు  ఒక్కరోజు కూడా ఎలాంటి ఉద్యమాలు చే యలేదు. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఆయన బృందం ఎలాంటి బాధాపడలేదు.


*ఎమ్మెల్సీ ఎన్నికల్లో లంచమిస్తూ...*

చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నిక్లలో ఓట్లు కొనుగోలు చేసేందుకు కోట్లు లంచమిస్తూ దొరికిపోయి ఆయనే ఈప్రాంతమంతా టెంపరరీ అనే పేరుపెట్టి, కనీసం 58 నెలల కాలం కూడా రాజధానిగా పరిపాలించిన ప్రాంతం గురించి అంటే అమరావతి గురించి ఉద్యమాలట. బాబు ఎలాంటి అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమాలు అట. ఇలాంటి ప్రాంతం గురించి ఇవాళ రకరకాల డ్రామాలు జరుగుతున్నాయి. 


*కట్టని, కట్టలేని రాజధానికోసం కృత్రిమ ఉద్యమం..*

రాష్ట్రాన్ని విడగొట్టడానికి వీల్లేదని ఒకరోజు ఉద్యమాలు కానీ, యాత్ర కానీ చేయని ఈ పెత్తందార్లు అందరూ, ఈ మహానుభావులందరూ వారు కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్‌ గురించి వేయి రోజులగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని, రియల్‌ ఎస్టేట్‌ ఉద్యమాన్ని మిగతా ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ.. .మరోవైపు ఇతర ప్రాంతాలను రెచ్చగొడుతూ ఈరోజు ఒక డ్రామాను నడుపుతున్నారు.


*పెత్తందార్ల సొంత అభివృద్ధి కోసమే...*

దశాబ్దాలుగా నిర్మించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కంటే కూడా, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ కంటే కూడా ఈ కట్టని, కట్టలేని అమరావతి వీరి దృష్టిలో ఎంతో గొప్పది. ఎందుకు వీరి దృష్టిలో అమరావతి ఎంతో గొప్పది అని ఆలోచన చేయాలి ? ఎవరి అభివృద్ధి కోసం వీరంతా ఉద్యమాలు, ఆలోచన చేస్తున్నారన్నది కూడా ఆలోచన చేయాలి ? బీసీల అభివృద్ధి కోసమా ? కాదే ? ఎస్సీల అభివృద్ధి కోసమా ? అదీ కాదు.  ఎస్టీల అభివృద్ధి కోసమా ? అదీకాదు. పోనీ మైనార్టీల అభివృద్ధి కోసమా అది కూడా కాదే ? పేద ఓసీల అభివృద్ధి కోసమా ?అదీకాదు ? మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమా ? అది కూడా కాదు, లేదు.

కేవలం ఈ పెత్తందార్ల సొంత అభివృద్ధి కోసం మాత్రమే.


చంద్రబాబు గారు దిగిపోయిన 2019లో రాష్ట్ర బడ్జెట్‌ ఆయన హయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగాఉంటూ ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం మనం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూస్తే.. దాదాపు ఒకటే ఉంటుంది. పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు రూ.2.27 లక్షల కోట్లు అయితే ఈరోజు రూ.2.50 లక్షల కోట్లు. అది కూడా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత.


చంద్రబాబు హయాంలో జగనన్న అమ్మఒడి ఎందుకు లేదు ? వైయస్సార్‌ ఆసరా ఎందుకు లేదు ? అదే చంద్రబాబు హయాంలో చేయూత పథకం, రైతు భరోసా పథకం ఎందుకు లేదు? ఏకంగా నవరత్నాల పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్లు కేవలం బటన్‌ నొక్కి డీబీటీ అంటే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఎలాంటి అవినీతి, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవ్వగలుగుతున్నాం. కరోనా ఉన్నా కూడా అందించాం. 


*అప్పుడు డబ్బులు ఎవరి జేబుల్లోకి పోయాయి...*

చంద్రబాబు హయాంలో 31 లక్షల ఇళ్లపట్టాలు ఎందుకు లేవు ?  21 లక్షల ఇళ్ల నిర్మాణం ఎందుకు జరగలేదు ? ఈ డబ్బులన్నీ ఆయన హయంలో ఎక్కడికి పోయాయి ? అప్పుడూ ఇంతే బడ్జెట్, ఇప్పుడూ ఇంతే బడ్జెట్‌. ఈ రోజు ఎందుకు ఈ పథకాలన్నీ జరుగుతున్నాయి ? అప్పుడు ఎందుకు జరగలేదు ?డబ్బులన్నీ ఎవరెవరి జేబులోకి పోయాయి ? 


ఎన్నికలప్పుడు మేనిఫెస్టో గురించి ప్రచారంలో ఉన్నప్పుడు ‡ అప్పలనర్శయ్య మాట్లడుతూ ఇవన్నీ అవుతాయా ? అని ప్రశ్నించాడు. ఈరోజు మనం ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం ? ఆ రోజు చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అన్నది అందరూ ఆలోచన చేయాలి. ఆ రోజు దోచుకో, పంచుకో, తినుకో డీపీటీ పథకం. 

చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. దోచుకోవడం పంచుకోవడం. వారు ఏం దోచుకున్నా పంచుకున్నా అడిగేవాడు ఉండడు, రాసేవాడూ ఉండడు. మనలాంటి వాళ్లు ప్రశ్నిస్తే... మైకులు నొక్కేస్తారు. దుష్ప్రచారాలు చేస్తారు.


*పెత్తందారీ మనస్తత్వం....*

చంద్రబాబు ఆయన బృందం ఆలోచనలు ఎలా ఉంటాయంటే.. రాజధాని అంటే మా బినామీ భూముల ప్రాంతం మాత్రమే రాజధానిగా ఉండాలి. ఇంకెక్కడా ఉండకూడదు అనేది పెద్దందారీ మన స్తత్వం ఉన్న మనుషుల ఆలోచనలు. పత్రిక అంటూ ఉంటే అది కేవలం ఈనాడు, చంద్రజ్యోతి మాత్రమే ఉండాలి. మరే పత్రికా ఉండనే ఉండకూడదు అనేది వీరి ఆలోచన. 


వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. పచ్చళ్లు అమ్మినా కూడా అవి మా వాళ్లు పచ్చళ్లే అమ్మాలి అని ఉంటుంది. చిట్‌ఫండ్స్‌ వ్యాపారం చేసినా కూడా మా వాడి చిట్‌ ఫండ్స్‌ వ్యాపారం మాత్రమే జరగాలి అని ఉంటుంది.

డిపాజిట్స్‌ సేకరణ చేసినా మా వాడే, అది కూడా ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించి చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. మావాడైతే ఏమైనా చేయవచ్చు. 

డెయిరీలు, పాలు అంటే ప్రభుత్వ రంగంలో లాభాల్లో ఉన్న చిత్తూరు డెయిరీని కూడా మూసివేయాలి. నా హెరిటేజ్‌ కోసం ఆ డెయిరీల పీక పిసికేయాలన్నదే ఈ పెత్తందార్ల మనస్తత్వం. ఈ రంగం ఆ రంగం ఆనే తేడా లేదు, వారు వీరు ఆనే తేడా లేదు. ఎవ్వరూ కూడా మార్కెట్‌లో ఉండకూడదు. నేను నా మనుషులు మాత్రమే ఉండాలి. అది ఇండస్ట్రీ అయినా, సినిమా అయినా ఏదైనా నేను నా మనుసులు మాత్రమే ఉండాలన్నది వీరి మనస్తత్వం. 


కార్పొరేట్‌ చదువులు తీసుకున్నా కూడా కేవలం మా నారాయణ, మా చైతన్య మాత్రమే ఉండాలి. గవర్నమెంటు బడులలో మాత్రం ఇంగ్లిషు మీడియం ఉండకూడదు. అన్ని వ్యవస్ధలు కూడా నా మనుషుల చేతుల్లోనే ఉండాలి. ప్రతిపక్ష పార్టీలలోకూడా నా మనుషులే ఉండాలి. అదే ఈ పెత్తందారీ మనస్తత్వం ఉన్న మనుషుల మెంటాలిటీ. 


రాజధానితో పాటు ఏది తీసుకున్న వీళ్ల ఆలోచనలు, డిజైన్స్‌ అన్నీ ఈ మాదిరిగానే ఉంటాయి. వీటికి అందమైన పేర్లు కూడా పెడతారు. అలాంటి కుట్రపూరితమైన ఒక డిజైన్‌ పేరు.. ఒకటే రాజధానిగా అమరావతి. ఈ డిజైన్‌ పేరు ఈ మధ్య మనం బాగా వింటున్నాం.


నిజంగా ఇది సాధ్యమయ్యే పనేనా అన్నది అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు ఇంతకముందు చాలా సందర్భాలలో నేను, నా సహచర మంత్రులు సమాధానం చెప్పారు. అదేవిధంగా నా మాట విన్న తర్వాత నిజమే కదా అని చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడ్డం జరిగింది. 


*అయినా కూడా సమయం, సందర్భం అదే కాబట్టి మరలా నాలుగు మాటలు చెపుతాను.*


*అమరావతితో సహా నాకు అన్ని ప్రాంతాలు సమానమే*

అమరావతి అనే ప్రాంతం మీద నాకు ఎలాంటి కోపం లేదు. నాకు ఎందుకు కోపం ఉండాలి. ప్రతి ప్రాంతం బాగుపడాలి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలన్న తపన, తాపత్రయం ఉంటుందే తప్ప, ఏ ప్రాంతం మీద వ్యతిరేకత, ప్రజల మీద వ్యతిరేకత ఎప్పుడూ ఉండవు.


అమరావతి ఇటు విజయవాడకు దగ్గరగా లేదు, అటు గుంటూరుకు దగ్గరగాలేదు. విజయవాడ నుంచి అయినా 40 కిలోమీటర్లు, గుంటూరు నుంచి అయినా 40 కిలోమీటర్లు ఉంటుంది. దేనికీ దగ్గరగా లేని ఈ ప్రాంతంలో కేవలం రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేటీ వంటి కనీస మౌలిక వసతులు కోసమే..ఈ 53వేల ఎకరాలకు గానూ,  చంద్రబాబునాయుడు గారు తనంతట తానే ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున అక్షరాలా రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని స్వయంగా లెక్క ఇచ్చారు.

 

కేవలం 53 వేల ఎకరాలు అంటే  8కిలోమీటర్ల రేడియస్‌లో రూ.1.10 లక్షల కోట్లు ఈ కనీస మౌలిక వసతులు కోసమే ఖర్చయ్యే పరిస్థితి ఉందని వాళ్లంతట వాళ్లే ఇచ్చిన నివేదిక. రాజధాని అంటే భవనాలు మిగిలిన వాటిని కూడా కలుపుకుంటే.. ఇటువంటి అమరావతిలో మిగిలినవాటికి కనీసం రూ.4 నుంచి రూ.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పడం విన్నాం.


5 యేళ్లలో చంద్రబాబు చేసిన ఖర్చు రూ.5674 కోట్లు.

 ఇంత ఖర్చవుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడుగారు తన ఐదేళ్ల పరిపాలనలో ఏ మేరకు ఖర్చు చేశాడో సభ ద్వారా ప్రజలకు మరొక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అంతగా ఒక మనిషి భ్రమలు కల్పించి, డిజైన్లు, గ్రాఫిక్స్‌ చూపించి మోసం చేస్తే... నిజానికి 420 కేసు పెట్టాలి. 


5 సంవత్సరాలలో ఆ పెద్దమనిషి సంవత్సరానికి రూ.1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. రూ.5674 కోట్లు మాత్రమే ఐదేళ్లలో ఖర్చు చేసి...మరో రూ.2297 కోట్లు మనల్ని కట్టమని బకాయిలుగా వదిలేశాడు. రాజధాని మీద ఇంత ప్రేమున్న వ్యక్తి ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలుగా వదిలేసివెళ్లాడన్నది ఆలోచన చేయాలి. ఈ పెద్దమనిషి ఇంతగా ఎందుకు రాజధానికి ప్రాకులాడూతూ.. ఆయన బినామీలందరికీ కూడా ఇక్కడ భూములుండి.. .ఇక్కడ అభివృద్ధి చెందితే ఆ భూములకి రేట్లు పెరుగుతుందని తెలిసి కూడా... ఒక ప్రభుత్వంగా ఎందుకు రూ.2297 కోట్లు బకాయిలు పెట్టాడు. 

ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇంతకన్నా ఎక్కువ పెట్టలేని పరిస్తితి. ఆయన ఐదేళ్లలో రూ.5674 కోట్లు పెట్టాడు, ఇంకో ప్రభుత్వం అంతకన్నా మెరుగ్గా ఐదేళ్లలో  రూ.6వేల కోట్లు పెడుతుందేమో... అంటే ఏడాదికి రూ.1000 కోట్లు, లేదా రూ.2వేల కోట్లు కూడా పెట్టలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉందన్న సంగతి అందరం తెలుసుకోవాలి. 


*80 శాతం ప్రజలు తెల్లరేషన్‌ కార్డు దారులే....*

మన పరిస్థితి ఏంటంటే.. .80శాతం పై చిలుకు ప్రజలు తెల్లకేషన్‌ కార్డు మీదే బ్రతుకుతున్న పరిస్థితి. మన అవసరాలేంటి, మన ప్రజలకు చేయాల్సిందేంటి అన్నది రాజకీయ నాయకులు మర్చిపోకూడదు.



*వంద సంవత్సరాలు పడుతుంది.*

 ఇలాంటి పరిస్థితుల్ల రూ.1.10 లక్షల కోట్లు పెట్టాలంటే... ఇప్పటికి రూ.5 వేల కోట్లు పెడితే.. మిగిలిన రూ.1.05 లక్షల కోట్లు పెట్టడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ 100 సంవత్సరాల కాలంలో కేవలం ఈ రోడ్లు, డ్రైనేజీకు, కరెంటుకు పెట్టే రూ.1లక్ష కోట్లు వందేళ్లలో ద్రవ్యోళ్భనం వల్ల కనీసం రూ.20–30 లక్షల కోట్లు అవుతుంది. సమయం గడిచే కొద్దీ, రేట్లు పెరిగే కొద్దీ ఇవాళ లక్ష కోట్లు అనేది వంద సంవత్సరాల కాలంలో రూ.20–30 లక్షల కోట్లు అయితే మనం దీన్ని ఏ రకంగా పూర్తి చేయగలుగుతాం అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.


ఈ ప్రాంతం మీద నాకు ఎటువంటి వ్యతిరేకతా లేదు. ఈ ప్రాంతంలో కూడా రాజధాని పెట్టడానికి నేను సిద్దపడ్డా. ఇక్కడ రాజధాని తీసేయడం లేదు. విశాఖపట్నంలోనూ, కర్నూలులోనూ రాజధానిని అదనంగా చేయాలన్ననే తప్ప... ఇక్కడ తీసేయాలని నేనెప్పుడూ అనలేదు. నాకు మంచి చేయాలనే తపన ఉంది. ఈ పది సంవత్సరాలలో నేను రూ.30–40 వేల కోట్లు ఖర్చుపెట్టినా...  ఈ లక్ష కాస్తా రూ.3 లక్షల కోట్లు అవుతుంది. ఎప్పటికీ పూర్తి కావు. పనులన్నీ కూడా సగంలో కనిపిస్తాయి. అవి కూడా భవనాలు కాదు.. రోడ్లు, నీళ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు మాత్రమే. ఇదొక డ్రీమ్‌ చేజింగ్‌.


*రాష్ట్రం అంటే...* 

మన రాష్ట్రం అంటే... 8 కిలోమీటర్ల రేడియస్‌ మాత్రమే కాదు.. రాష్ట్రం ఉంటే 1,62,967 చదరపు కిలోమీటర్ల భూభాగం. మన రాష్ట్రం అంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగం. కేవలం 50 వేల ఎకరాల లబ్దికోసం మాత్రమే ఉన్న భూమి కాదు. చంద్రబాబు దృష్టిలో రైతులు అంటే కేవలం 35వేల ఎకరాల భూమిలిచ్చిన రైతులు మాత్రమే అనుకుంటే కుదరదు. మన దృష్టిలో రైతులంటే ఈ 35 వేల ఎకరాలిచ్చిన రైతులతో పాటు రైతుభరోసాను అందుకుంటున్న మరో 50 లక్షల మంది రైతులు అన్నది మర్చిపోకూడదు. 


చాలా సందర్భాల్లో చంద్రబాబు ఆయనతో పాటు దుష్టచతుష్టయం సభ్యులందరూ వాళ్ల పేపర్లలోనూ, టీవీల్లోనూ కామన్‌గా అనే మాట... ఇది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని. దీనిపై ఆలోచన చేస్తే.. ఇక్కడ ఎన్ని ఎకరాల భూములన్నాయి, అవి అమ్మితే ఎంత వస్తుంది. ఈవిషయాలు అందరికీ తెలుసుండాలి. 

ఇక్కడ గ్రీన్‌  ట్రిబ్యునల్, రివర్‌ కన్జర్వేషన్‌ పరిధిలో ఉన్న ప్రాంతాలు.. అంటే కృష్టా నదీ పరివాహక ప్రాంతాలు  దాదాపు 820 ఎకరాలు ఇక్కడ ఉన్నాయి. లంక భూములు,  ఎన్జీటీ, నదీ గర్భంలో ఉన్నవి, కరకట్ట భూములు కూడా ఉన్నాయి. ఈ భూమి తీసేస్తే... మరో 4997 ఎకరాల భూమి ఉంది. మొత్తం 5817 భూమి ఉంది. వీటిలో 820 ఎకరాల భూమి అమ్మాలనుకున్నా ఎన్జీటీ కోర్టు అంగీకరించదు. 


05–02–2019న చంద్రబాబు ప్రభుత్వంలోనే ఇచ్చిన జీవో ప్రకారమే 5020 ఎకరాలు మాత్రమే కమర్షియల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు ఉంది అని చెప్పారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 దొంగలముఠా సభ్యులందరూ కూడా పదివేల ఎకరాలు, 20 వేల ఎకరాలు ఉన్నాయని చెప్తారు. ఇష్టమొచ్చినట్లు రాస్తారు, టీవీల్లో చూపిస్తారు. అందరూ కలిసి ప్రజలను మోసం చేస్తారు. 


రామోజీయా ?, రాధాకృష్ణా ? ఈ భూములు ఎవరు కొంటారు ? 

5020 ఎకరాలు మాత్రమే ఆయన లెక్కల ప్రకారం ఉన్న భూమి. ఈ భూమిని ఎకరాకు రూ.20 కోట్ల చొప్పున  ఇవాళ మన చేతిలోకి డబ్బు వచ్చేటట్టు అమ్మితేనే...  రూ.1లక్ష కోట్లతో ఈ భూమిలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇవాళ ఈరోజు ఇంత ధర ఉందా. ఇంత ధరకు బాబు కొంటాడా ? పోనీ రామోజీరావు కొంటాడా? రాధాకృష్ణ కొంటాడా? పోనీ టీవీ5 నాయుడు కొంటాడా? ఇంత ధర లేనప్పుడు ఈ మధ్య కాలంలో ఈనాడు రాసింది.. ఎకరం రూ.10 కోట్లకు కొంటారా అని వీళ్లు మనల్ని తిరిగి అడుగుతున్నారు ? మీరే ఎకరా రూ.10 కోట్లకు కొంటారా అని మమ్నల్ని అడుగుతున్నారు ? మీరే కొనలేరు, ఈ రేటు రాదని చెబుతున్నారు, మరి ఈ ప్రాజెక్టు ఎలా చేయగలుగుతాం అని నేను మిమ్నల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ? ఎకరాకు రూ.20 కోట్లు వస్తే రూ.1 లక్ష కోట్లు అవుతుంది. ఎకరాకు రూ.10 కోట్లు రాదని మీరే చెప్తున్నారు. మరలా మీరే గజం రూ.17వేలకు కూడా ఎవరూ రాలేదు అని రాస్తారు.  4 బిడ్లు మాత్రమే వచ్చాయి అని రాస్తారు. అలా చూసుకున్నా.. 2500 గజాలు ఎకరాకు వస్తున్నా.. ఎకరా రూ.4 కోట్లు అవుతుంది. దానికి కూడా ఎవరూ రావడం లేదు. 

మరి ఏ రకంగా ఈ ప్రాజెక్టు మనం చేయగలుగుతాం ?. ఇంత డబ్బులు ఎక్కడ నుంచి తీసుకుని రాగలుగుతాం ? ఇంత డబ్బులు మనం తీసుకునిరాలేకపోతే ఈప్రాజెక్టు అడుగులు మందుకు పడకపోతే ఈ ప్రాంతంలో ఉన్న రైతులేం కావాలి ? బినామీలు ఎలాగూ పోతారు. మరోవైపు రూ.1.10 లక్షల కోట్లు ఇక్కడ పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది.



*పది శాతం డబ్బుతో విశాఖపట్నం అభివృద్ధి.*

ఇందులో కేవలం 10శాతం అంటే రూ.1.10 లక్షల కోట్లకు గానూ... కేవలం రూ.10 వేల కోట్లు విశాఖలో పెడితే చాలు. విశాఖపట్నాన్ని మనం ఎక్కడికో తీసుకునిపోతాం. ఎందుకంటే విశాఖలో ఇప్పటికే రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి కనీస వసతులు ఉన్నాయి. వీటి మీద మనం డబ్బులు పెట్టాల్సిన పనిలేదు. కేవలం మెరుగులు దిద్దేందుకు మాత్రమే కాస్తా, కూస్తో డబ్బులు పెట్టాలి. విశాఖపట్నం మాత్రమే ఎందుకు చెబుతున్నాననంటే... విశాఖపట్నం అంటే నాకు ఎక్కువ ప్రేమ లేదు, అమరావతి అంటే తక్కువ ప్రేమ ఉందని కాదు. అమరావతి ప్రజలైనా, విశాఖపట్నం ప్రజలైనా నాకు సమానమే. కాకపోతే విశాఖపట్నం రాష్ట్రంలో అతిపెద్ద నగరం. ఇది నిజం. దశాబ్ధాలుగా అక్కడ అభివృద్ధి జరిగింది. అక్కడ జరిగిన అభివృద్ధికి మరికాస్తా తోడ్పాటునందిస్తే... మరో రూ.10 వేల కోట్లు పెడితే ఇంకా పెద్ద నగరం అవుతుంది. ఇది వాస్తవం. 


అక్కడ విశాఖపట్నంలో మనం చేయగలం. అక్కడ మనం చేయగలిగిన చోట వీళ్లు  చేయకుండా అడ్డుకుంటారు. ఇక్కడ మనం చేయలే ం, బాబూ చేయలేదు. అయినా బాబు చేయలేని దాన్ని, ఎవరూ చేయలేని దాన్ని మనం చేయాల్సిందే అని చెప్పి.. రోజూ ధర్నాలు, డ్రామాలు, డ్యాన్సులు ఇదే జరుగుతోంది. మన మీద బురద జల్లాలని దుర్భిద్ధితో డ్రామాలు ఆడుతున్నారు. దీనిమీద ప్రజలందరూ ఆలోచన చేయాలి.


*చంద్రబాబు విజయవాడకేం చేశాడు ?* 

విశాఖçపట్నాన్ని కాస్తా పక్కనపెడితే.. విజయవాడకు చంద్రబాబు ఏం చేశాడో చూద్దాం. మన ప్రభుత్వం వచ్చాక.. ఈ ప్రాంత అభివృద్ది మీద ఎంత శ్రద్ధ పెట్టామన్నది ఈ సభ సాక్షిగా కొన్ని విషయాలు చెప్తాను.

విజయవాడకు పశ్చిమ బైపాస్‌ అభివృద్ధి చెందుతుంది. గన్నవరం సమీపంలోని చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు రూ.1321 కోట్లతో 30 కిలోమీటర్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీనిలో 17.08 కిలోమీటర్లు పూర్తయింది. 65 శాతం పనులను 65 శాతం నిధులు వెచ్చించి పూర్తి చేశాం. వచ్చే ఏడు పిబ్రవరి నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయి. ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పనులన్నీ ఎందుకు పూర్తి చేయలేదు. గొల్లపూడి నుంచి కృష్టానది మీదుగా బ్రిడ్జి కట్టి.. చిన కాకాని వద్ద చెన్నై జాతీయ రహదారిని కలిసే రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. ఇది 18 కిలోమీటర్లు రోడ్డు. రూ.1600 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 33 శాతం పనులను 31 శాతం నిధులు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. 2024లో ఇది పూర్తవుతుంది. 


ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు రాకుండా... దీన్ని అడ్డుకున్నది ఎవరు. ఎందుకీ ప్రాజెక్టును రానివ్వలేదు. ఎందుకు దీన్ని అడ్డుకున్నారు. భూసేకరణ చంద్రబాబునాయుడు గారు రాకముందే రాజశేఖర్‌రెడ్డి గారు హయాంలోనే పూర్తయింది. పనులు మొదలుపెట్టి పూర్తి చేయాల్సింది ఎందుకు చేయలేదు ? విజయవాడ– మంగళగిరి బాగా విస్తరించడానికి ఈ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుంది. 

కారణం విజయవాడ, మంగళిగిరి అభివృద్ధి కాకూడదు. కారణం అమరావతిలో బినామీల భూముల విలువ పెరగాలి.

Comments