ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);
త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిగేలా చేసిన ఏర్పాట్లను భక్తులు స్వాగతిస్తున్నార
ని డిప్యూటీ సీఎం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఏర్పాటు చేసిన క్యూలైన్లను, చేసిన ఏర్పాట్లను సోమవారం డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మాత్యులు కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులేకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. వినాయకుని గుడి వద్ద నుండి ప్రారంభమైన క్యూలైన్లో భక్తులకు అరగంటలోనే అమ్మవారి దర్శనం జరిగేలా చేసిన ఏర్పాట్లను భక్తులు స్వాగతిస్తున్నారన్నారు. క్యూలైన్లో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. ప్రసాదాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిచోట్ల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. సామాన్య భక్తులకు విఐపి లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. అక్టోబర్ 2 నుండి రెండు నుండి ఐదో తేదీ వరకు భక్తులు మరింత పెరగనున్నారని దానిని దృష్టిలో పెట్టుకొని మరింత పట్టిష్టంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు.
వినాయకుని గుడి వద్ద నుండి అమ్మవారి దర్శనం వరకు మంత్రి కొట్టు సత్యనారాయణ క్యూలైన్లను పరిశీలించి చేసిన ఏర్పాట్లను భక్తులను అడిగి తెలుసుకున్నారు.
addComments
Post a Comment