కోటప్పకొండ లో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ 'శివశంకర్'

 కోటప్పకొండ లో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ 'శివశంకర్' నరసరావుపేట, (ప్రజా అమరావతి)) ::- ఈనెల 27 వ తారీఖున ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కోటప్పకొండ ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తేటి మంగళవారం ఉదయం కోటప్పకొండలో ఏర్పాటు చేయనున్న రోప్ వే, బోట్ షికారు మరియు పార్క్  అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బోటు షికారు ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా, ఇద్దరు పట్టే విధంగా యంత్ర రహిత బోట్లను సిద్ధం చేయవలసిందిగా సూచించారు. అదేవిధంగా పార్కును శుభ్రంగా ఉంచేలా ఇసుకను తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పర్యాటకులకు ఉపయోగపడే విధంగా జలవిహార్( బోట్ షికార్) కేంద్రం వద్ద ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రవేశ రుసుము సేకరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలను పరిశీలించారు. వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వార్త వెంకటేశ్వర చారి తో మాట్లాడుతూ ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, ఏ ఏ వయసు వారిని చేర్చుకుంటున్నారు, బోధన అంశాలు ఏమిటి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి జోసప్ కుమార్, ఎల్ డి ఎం వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ అధికారి సయ్యద్ హుస్సేన్, మండల రెవెన్యూ అధికారి రమణ నాయక్, కోటప్పకొండ దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేమూరి గోపి వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తొలుత కోటప్పకొండ దేవాలయం మెట్ల వద్ద ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image