ప్రభుత్వ అవసరాల నిమిత్తం రాజమహెంద్రవరం డివిజన్ భూమి అవసరమైయున్నది



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



ప్రభుత్వ అవసరాల నిమిత్తం రాజమహెంద్రవరం డివిజన్ భూమి అవసరమైయున్నద


ని రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసియున్నారు ,  భూమి నష్టపరిహారం క్రింద భూసేకరణ చట్టం నిబంధనలను అనుసరించి ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరాకు రెండున్నర రెట్లు (2.5) ధర లేదా పరిసర భూముల విలువ ఆధారముగా భూమి పరిహారం చెల్లించుబడునని తెలిపియున్నారు.  సదరు భూమి మెరక భూమి అయి ఉండవలెనని మరియు ముంపు భూమి అయి ఉండరాదని తెలిపియున్నారు.   ఇందుకు సంబంధించి రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో ఈ దిగువ తెలిపిన మండల పరిధిలోగల గ్రామము నుండి భూమి ప్రభుత్వం వారికి అవసరమైయున్నది.  భూమి ఇచ్చుటకు ఆసక్తిగల రైతులు భూమి వివరములు మరియు సంబంధిత పత్రములతో సబ్ కలక్టరు వారి కార్యాలయం, రాజమహేంద్రవరం నందు దరఖాస్తులు సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0883-2442344, 8977935604 గా పేర్కొనడం జరిగింది.


మండలాలు, గ్రామాల వారీగా 


భూమి అవసరమైన మండలం, గ్రామాలు వారీగా రాజానగరం మండలంలో వెలుగుబంద,  కోరుకొండ లో గాదరాడ, కోటికేశవరం గ్రామాల్లో, బిక్కవోలు లో బిక్కవోలు, కాపవరం, కొమరిపాలెం, కొంకుదురు, పందలపాక, మెల్లూరు, తొస్సిపూడి గ్రామాల్లో,  అనపర్తి లో అనపర్తి,  దుప్పలపూడి,  పులగుర్త, రామవరం, కుతుకులూరు, కొప్పవరం, పెడపర్తి, మహేంద్రవాడ, ఎల్.ఎన్.పురం, పి.ఆర్.సి.పురం, పొలమూరు గ్రామాల్లో,  రంగంపేట మండలం లో  జి.దొంతమూరు,  రంగంపేట, నల్లమిల్లి, పెదరాయవరంగ్రామాల్లో , సీతానగరం మండలం లో 

పురుషోత్తపట్నం,  మునికూడలి, మిర్తిపాడు గ్రామాల్లో  గోకవరం గోకవరం, తంటికొండ, క్రిష్ణునిపాలెం గ్రామాల్లో భూమి అవసరమై ఉన్నదని తెలియచేసియున్నారు.



Comments