*కనీస వేతనాల చట్టం క్రింద వినియోగదారు ధరల సూచిక సంఖ్యల ఖరారు*
అమరావతి, సెప్టెంబరు 30 (ప్రజా అమరావతి): కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం వివిధ షెడ్యూల్డు ఉద్యోగాలలో పనిచేసే ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ ను 01.10.2022 నుండి 31.03.2023 వరకు గణించే నిమిత్తం సగటు వినియోగదారు ధరల సూచిక సంఖ్యలను ప్రకటించినట్లు కార్మిక శాఖ ప్రత్యేక కమీషనర్ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. 2022 జూన్ తో మొదటి అర్ధ సంవత్సరం ముగిసే నాటికి పార్టు-1 క్రింది పారిశ్రామిక కార్మికులకు సగటు వినియోగదారు ధరల సూచిక సంఖ్యలను 1614 పాయింట్లుగా (బేస్ ఇయర్ 1982= 100 సిరీస్) మరియు పార్టు-2 క్రింద వ్యవసాయ కార్మికులకు 1260 పాయింట్లు గా (బేస్ ఇయర్ 1986-100 సిరీస్) ఖరారు చేసినట్లు ఆ ప్రకటనలో ఆయన తెలిపారు.
addComments
Post a Comment