ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ ఎలా గొప్ప వ్యక్తి

 *ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ ఎలా గొప్ప వ్యక్తి


*


*జగన్ వచ్చిన తర్వాతే ఆరోగ్య రంగం భ్రష్టుపట్టింది*


*టీడీపీ హయాంలో 18 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసాం*


*హెల్త్‌ వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించేంతవరకూ పోరాడతాం*


*ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు*


విజయవాడ (ప్రజా అమరావతి) : ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  భేటీ అయ్యారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఆయన కలిశారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై బిశ్వభూషణ్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజభవన్‌కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందజేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పేరు మార్పునకు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.


ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 1986లో హెల్త్‌ యూనివర్సిటీని ఎన్టీఆర్‌ స్థాపించారని,  తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకో మెడికల్‌ కాలేజీ తీసుకువచ్చామన్నారు. టీడీపీ హయాంలో 18 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం జగన్‌రెడ్డి  దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. హెల్త్‌ వర్సిటీ పేరు మారుస్తూ చీకటి జీవో తెచ్చారని, హెల్త్‌ వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించేంతవరకూ పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్‌ పాలనలో 3 మెడికల్‌ కాలేజీలకు మాత్రమే గుర్తింపు వచ్చిందని చంద్రబాబు అన్నారు. రాత్రి వాళ్ల నాన్న (వైఎస్సార్) ఆత్మతో మాట్లాడి హెల్త్‌ వర్సిటీ పేరు మార్చారా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కంటే వైఎస్‌ఆర్‌ ఎలా గొప్ప వ్యక్తి? అంటూ నిలదీశారు. వైఎస్‌ఆర్‌, జగన్ కలిసి ఎన్ని మెడికల్‌ కాలేజీలు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ కొత్త మెడికల్‌ కాలేజీ నిర్మించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టుకోవాలన్నారు. వైద్యరంగాన్ని జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ ఎలా గొప్పవాడు?:  విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్ ను కలిశారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. 1986లో హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకొక మెడికల్ కాలేజీని తీసుకొచ్చానని తెలిపారు. జగన్ మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు. హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ చీకటి జీవోను తీసుకొచ్చారని తెలిపారు. జగన్ వచ్చిన తర్వాతే ఆరోగ్య రంగం భ్రష్టుపట్టిందని చెప్పారు. జగన్ సీఎం అయిన తర్వాత మూడు మెడికల్ కాలేజీలకు గుర్తింపు మాత్రమే వచ్చిందని అన్నారు. రాత్రి వాళ్ల నాన్న ఆత్మతో మాట్లాడి యూనివర్శిటీ పేరును మార్చారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. వైఎస్సార్, జగన్ ఇద్దరూ కలిసి ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారో చెప్పాలని అన్నారు. ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ ఎలా గొప్ప వ్యక్తి అని చంద్రబాబు ప్రశ్నించారు.

Comments